గాల్లో ఎగిరిన ఫ్లైయింగ్ కార్...!
అంతేకాదు స్కైడ్రైవ్, కార్టివేటర్ 2020 రిలీజ్ చేసిన ఫొటోల్లో టెస్టింగ్ ప్లైయింగ్ కారులో ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నట్లు కనిపించాడు. ఇక జపాన్‌లోని టయోటా టెస్ట్ ఫీల్డ్‌లో ఈ కారును టెస్ట్ చేశారు. జపాన్‌కి చెందిన స్కైడ్రైవ్ కంపెనీ ఈ కారును తయారు చేసింది. విజయవంతంగా ఓ వ్యక్తితో సహా కారును గాల్లోకి ఎగరేసి చూపించారు.
ఏ విమానంలోనో కాకుండా స్వయంగా సొంతకారులోనే అలా ఎగురుతూ వెళ్లిపోతే ఆ థ్రిల్లే వేరు. ట్రాఫిక్ సమస్యలూ ఉండవు. గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. ఎంతో బరువుండే కారును గాల్లోకి లేపి దూసుకెళ్లేలా చేయడమన్నది దశాబ్దాలుగా ఓ కలలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 ప్రాజెక్టులు ఇలాంటివి ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మనిషితో సహా గాల్లోకి కారును ఎగరేసి చూపించాయి. దుబాయ్‌లో డ్రోన్ కార్ల కాన్సెప్ట్ ఉంది. అది కొంతవరకూ విజయం సాధించింది.
అంతేకాక ఈ ప్రయోగంలో కారు 2 మీటర్ల ఎత్తు వరకూ గాల్లోకి లేచి ప్రయాణం చేసింది. ఇక చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలల్లో నాలుగు నిమిషాలపాటూ గాలిలో చెక్కర్లు కొట్టింది. ఈ ఫ్లైయింగ్ కారును ఆ సంస్థ 2023లో మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఈ కార్ల వాడకం సేఫ్ అని మేం గ్యారెంటీ ఇవ్వలేం" అని స్కైడ్రైవ్ చీఫ్ టోమోహిరో ఫుకుజావా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కారు 10 నిమిషాలు మాత్రమే గాలిలో ఎగరగలదని తెలిపారు. మరింత మార్పులు చేస్తే 30 నిమిషాలపాటూ గాలిలో ఎగరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.