వాట్సాప్ ద్వారా భారత్ లో ప్రమాదకర సైబర్ దాడులు...?

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. కానీ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు వాట్సాప్ అప్లికేషన్ ఉపయోగించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వాట్సాప్ పై హ్యాకర్లు తరచుగా దాడులకు పాల్పడుతున్నారు. వాట్సాప్ వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ఆర్మీ పలు సూచనలు చేసింది. వాట్సాప్ ద్వారా ప్రమాదకర సైబర్ దాడులు జరుగుతున్నట్లు భారత సైబర్ భద్రతా సంస్థ హెచ్చరించింది. 
 
వైరస్ లు వినియోగదారుల నుండి ఎటువంటి అనుమతులు కోరకుండా వాట్సాప్ యాప్ లోకి చొరబడే అవకాశం ఉందని భారత సైబర్ భద్రతా సంస్థ తెలిపింది. ఎంపీ4 ఫైళ్ల ద్వారా ఎక్కువగా దాడులు జరిగే అవకాశం ఉందని సైబర్ భద్రతా సంస్థ చెబుతోంది. ఇప్పటికే పెగాసన్ వైరస్ తో వాట్సాప్ యాజమాన్యం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎంపీ4 ఫైళ్ల ద్వారా సైబర్ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు వినియోగదారులను, వాట్సాప్ యాజమాన్యాన్ని కలవరపెడుతున్నాయి. 
 
సైబర్ నేరగాళ్లు ప్రమాదకర ఎంపీ4 ఫైళ్లని పంపి సైబర్ దాడులకు పాల్పడుతున్నారని సైబర్ భద్రతా సంస్థ తెలిపింది. సైబర్ భద్రతా సంస్థ వినియోగదారుల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ ఫైళ్లు డౌన్ లోడ్ అవుతాయని చెబుతోంది. సైబర్ భద్రతా సంస్థ వాట్సాప్ వినియోగదారులు వెంటనే వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది. హ్యాకర్లు ఎక్కువగా వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ నిఘా వర్గాలు 86తో ప్రారంభమయ్యే నంబర్లు మరీ ప్రమాదకరమని చెబుతున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: