Flipkart లో అమ్మకానికి సిద్దంగా ఉన్న గేమింగ్ ఫోన్..!!!
ఇటీవల కాలంలో ఇండియాలో
గేమింగ్ ఫోన్ రిలీజ్ అయ్యింది. నుబియా పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ఇప్పుడు భారత
మార్కెట్ లోకి దూసుకువెళ్ళడానికి సిద్దంగా ఉంది. సహజంగా స్మార్ట్ ఫోన్ అత్యధికంగా
అమ్ముడుపోవడానికి గల కారణం కెమెరా అయితే మరొకటి గేమ్స్. చిన్నదో పెద్దతో మొబైల్స్
లో గేమ్స్ ఉండాల్సిందే. ఇదే దృష్టిలో పెట్టుకున్న సదరు సంస్థ ఇప్పుడు గేమింగ్ ఫోన్
సిద్దం చేయడంతో యూజర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
సరికొత్త స్నాఫ్ డ్రాగన్ 855 + Soc శక్తితో కలిగిన ఈ ఫోన్ ధర సుమారు రూ 35,999 గా నిర్ధారించబడింది. దీపావళి స్పెషల్ సేల్ లో భాగంగా అక్టోబర్ 21 నుంచీ సేల్స్ మొదలయ్యాయి. ఈ ఫోన్ ఇప్పుడు ఆఫర్ లో గనుకా కొంటె 499 తో పూర్తిస్థాయిలో సెక్యూరిటీ కూడా ఉంటుదని సంస్థ తెలిపింది.
నుబియా రెడ్ మ్యాజిక్ 3s తో రిలీజ్ అయిన ఈ ఫోన్ యొక్క 8జీబీ ర్యామ్ వేరియన్ ధర రూ 35,999 కాగా 12 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.47,999 గా నిర్ధారించబడింది. 6.65 స్క్రీన్ తో ఫుల్ hd తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫోన్ ఎంతో వేగంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే 5000 mah బ్యాటరీ సామర్ధ్యంతో, ఆరుగంటల కంటే ఎక్కువగా గేమ్స్ ఆడుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. 48 మెగా పిక్సల్ కలిగి ఉంది, ముందు కెమెరా 16 మెగా పిక్సల్ కలిగి ఉంటుంది. ఇందులో ఇంబిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంటుంది. అంతేకాదు గేమింగ్ కోసం ప్రత్యకంగా కొన్ని బటన్స్ కూడా అమర్చారు.