ఫోన్ పోయిందా..ఇక బెంగపడకండి...!!!
చాలా మంది తమ ఫోన్ లని
పోగొట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తారు. కొంతమంది తమది చిన్న ఫోన్ పోయినా సరే ఎంతో సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు.
ఇంకొంతమంది అత్యంత ఖరీదైన ఫోన్ పోగొట్టుకుని ఏమి చేయాలో అసలు దొరుకుతుందో లేదో అంటూ
బెంగ పెట్టుకుంటారు. అయితే ఇక పై ఇలాంటి పరిస్థితుల నుంచీ సులభంగా బయటపడచ్చు
అంటోంది తేలి కమ్యునికేషన్ డిపార్ట్మెంట్
ఫోన్ పోయిన వెంటనే మీరు ఈ పద్దతులని పాటిస్తే తప్పకుండా ఫోన్ మీకు దొరుకుతుందని చెప్తున్నారు. సరికొత్త విధానం వలన ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేసినట్టుగా ఫోన్ కూడా బ్లాక్ చేయవచ్చు అంటున్నారు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఫోన్ పోగొట్టుకున్న వారికి మళ్ళీ ఫోన్ వారి చేతికి వచ్చేలా డాట్ కొత్త ప్రాజెక్ట్ రూపొందిం. అందులో భాగంగా. ఫోన్ పోయిన వెంటనే మీరు సంభందిత పోలీసు వారికి కంప్లైంట్ చేయాలి. వారు ఇచ్చిన FIR కాపీ తీసుకుని వెంటనే 14422 ( ఇది డాట్ టోల్ ఫ్రీ నెంబర్ ) కి ఫోన్ చేయాలి. తమ ఫోన్ పోయిన వివరాలు పోలీసులకి ఫిర్యాదు చేసిన FIR వివరాలు తెలిపాలి.
ఆ తరువాత డాట్ ఫోన్ వివరాలు తెలుసుకుని. ఫోన్ IMEI నెంబర్ ద్వార ట్రేస్ చేసి ఫోన్ బ్లాక్ చేస్తుంది. ఆ ఫోన్ ఎవరు వాడాలని అనుకున్నా సరే అది పని చేయదు సరికదా ఆ ఫోన్ లో ఎ నెట్ వర్క్ సిమ్ వేసినా సరే సంభందిత నెట్వర్క్ సంస్థకి ఫోన్ ఎవరి దగ్గర ఉందనే వివరాలు వెళ్ళిపోతాయి. దనతో సులభంగా ఫోన్ ఎక్కడ ఉందో పట్టుకుని డాట్ పోలీసులకి సమాచారం అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సేవలు మహారాష్ట్ర కి మాత్రమే పరిమతం అయ్యయాని. త్వరలో అన్ని రాష్ట్రాలకి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని డాట్ తెలిపింది.