చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో నేడు సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుండి జీఎ్‌సఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ ద్వారా జాబిల్లి వైపు దూసుకెళ్లనుంది.15వ తారీకున ప్రయాగంలో సాంకేతిక లోపాన్ని అధిగమించిన తర్వాత రిహార్సల్ కూడా విజయవంతం కావడంతో ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ జీఎస్‌ఎల్వీ రాకెట్ మార్క్3ఎం1 బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్-2 కంపోజిట్ మాడ్యూల్‌తో ఈ రాకెట్ పయనిస్తుంది. చెంద్రుడి వద్దకు వెల్లెందుకు రాకెట్ సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీన 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తి చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ లోపాన్ని సరిచేసిన తర్వాత వారం రోజులకే దానిని తిరిగి ప్రయోగానికి సన్నద్ధం చేశారు.
ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలంతా ఒక పెద్ద సవాల్‌గా తీసుకున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆదివారం సాయంత్రం షార్‌కు చేరుకుని శాస్త్రవేత్తలతో దీని పై సమీక్షించారు. ‘15న గుర్తించిన సాంకేతిక లోపాన్ని సరిచేశాం. ప్రయోగానికి రాకెట్ పూర్తి సన్నద్ధతో ఉంది. రిహార్సల్ విజయవంతంగా పూర్తయ్యింది. చంద్రయాన్-1 ద్వారా జాబిల్లిపై నీటి జాడలు తెలియడంతో.. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ చంద్రయాన్-2 ఆకర్షిస్తోంది. ఎలాంటి శాస్త్రీయ పరిశోధన చేస్తుంది.. దాని ఫలితాలేమిటనేదానిపై ఆసక్తి నెలకొంది’ అని శివన్ విలేకరులకు తెలిపారు.
ఈ సందర్భంగా కొంతమంది ఔత్సాహికులు 1981 లో ఇందిరాగాంధి హయాం లో ఇస్రో ప్రయొగించిన మొదటి 'APPLE' శాటిలైట్ అప్పట్లొ ఎద్దులబండి లో ఎలా తీసుకువెళ్లారో చూపిస్తు ఒక ఫొటో ను ట్వీట్ చెసారు.