"అమెజాన్"..సంచలన నిర్ణయం..సరికొత్త రంగంలోకి...!!!!

NCR

ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ మార్కెట్ లో తిరుగులేని హవా కొనసాగిస్తున్న ఏకైక ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం అమెజాన్. తన సేవలని ప్రపంచలో ఎక్కడికైనా సరే చేర్చగలిగే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంది. అమెజాన్ నుంచీ ఇప్పటికే షాపింగ్‌, నగదు బదలాయింపు, బిల్లుల చెల్లింపు, మొబైల్‌ రీఛార్జి వంటి సేవలను అమెజాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంతో మంది ఆన్లైన్ వినియోగదారులకి చేరువ అయ్యింది. అయితే

 

తాజాగా అమెజాన్ సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. భారత్ లో ఇక నుంచీ అమెజాన్ విమాన యాన టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో బుక్‌ చేసుకొన్న టికెట్లను రద్దు చేస్తే అదనంగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని అమెజాన్ సంచలన ప్రకటన చేసింది. తమకి కేవలం విమానయాన సంస్థ విధించే పెనాల్టీలు మాత్రం చెల్లిస్తే చాలని తెలిపింది.

 

అమెజాన్ సరికొత్త సేవలను 'క్లియర్‌ట్రిప్‌' సంస్థతో కలిసి అమెజాన్‌ యాప్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా తాము  “క్లియర్‌ ట్రిప్‌” తో కలిసి పనిచేయడానికి ఎంతో సంతోషంగా ఉన్నామని కస్టమర్లకి అత్యన్నత సేవలు అందించడంలో అమెజాన్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుందని, అమెజాన్‌ యాప్‌ వినియోగించే వారికి, అలాగే అమెజాన్  ప్రైమ్‌ సభ్యత్వం తీసుకొన్నవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమెజాన్‌ పే డైరెక్టర్‌ షరీక్‌ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: