టీవీ: బిగ్ బాస్9 అగ్నిపరీక్షలో సరికొత్త రూల్స్.. పాటిస్తేనే ఛాన్స్!
ఇక అందులో ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేయగా.. ఇప్పుడు ఆ 45 మందికి 'అగ్నిపరీక్ష' అంటూ ఒక మినీ షోని రన్ చేయబోతున్నారు. అగ్ని పరీక్షలో ఈ 45 మందికి టాస్కులు నిర్వహించి, నెగ్గిన 5 మందిని హౌస్ లోకి పంపించబోతున్నారు. అగ్నిపరీక్ష కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్ , అభజిత్ , బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 22 నుంచి ఈ అగ్నిపరీక్ష గేమ్ మొదలుకానుంది. సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతుంది. జియో హాట్ స్టార్ లో దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు జడ్జెస్ వీరికి అనేక టాస్కులు ఇస్తారట. గేమ్స్ పెడతారట. అనేక సవాళ్లను ఇస్తారట. క్లిష్ట సమయాలను క్రియేట్ చేస్తారని, ఆ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు? పరిస్థితులను ఎలా డీల్ చేస్తారు? వారి ఆలోచన విధానం ఎలా ఉంది? ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు? ఇలా అన్ని విషయాలను చూసి ఆ తర్వాత ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.
అంతేకాదు ఈ అగ్నిపరీక్షలో టాస్కులకు సంబంధించి మాజీ కంటెస్టెంట్లు కూడా సలహా ఇస్తున్నారు. అగ్నిపరీక్షలో టాస్క్ లు ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో కూడా చెబుతున్నారు.. ఈ మేరకు మాజీ కంటెస్టెంట్స్ అయిన అర్జున్ కళ్యాణ్, నిఖిల్ వంటి వారు వీడియోలు కూడా విడుదల చేశారు. ముఖ్యంగా అగ్ని పరీక్షలో డబుల్ స్పైసీ ఉంటుంది అని.. ముగ్గురు రూత్ లెస్ జడ్జ్ లు ఉంటారు అని, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే స్వీట్ వర్డ్స్ తో కాదు హార్డ్ వర్క్ తో, ఫైర్ తో ఇంప్రెస్స్ చేయాలని సలహా ఇస్తున్నారు. ఇక్కడ టాస్కులు అంత ఈజీగా ఉండవని, సహనాన్ని, తెలివితేటలను, శక్తిని పరీక్షించి ఆ తర్వాత హౌస్ లోకి పంపిస్తారని చెబుతున్నారు. మరి హౌస్ లోకి వెళ్ళబోయే ఆ ఐదుగురు ఎవరో చూడాలి.