టీవీ: ఆడపిల్లని కనాలని ఉంది.. కోరిక బయటపెట్టిన అనసూయ..!
ఈ కార్యక్రమం అనసూయ కెరియర్ ని మార్చేసింది. అక్కడ అనసూయ తన హవా చూపించి జబర్దస్త్ తో వచ్చిన పాపులారిటీతో పలు రకాల సినిమా ఈవెంట్స్, ఇతరత్రా ఫంక్షన్లకు ఇంటర్వ్యూలకు హోస్టుగా కూడా చేసేది. అలాంటి సమయంలోనే సినిమాలలో అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్ళింది.. అలా రంగస్థలం, క్షణం, యాత్ర, విన్నర్, కిలాడి, పుష్ప, రజాకర్ తదితర చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.
అయితే అనసూయ NCC లో ఉన్న సమయంలో శశాంక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.. అనసూయ, శశాంక్ తో పెళ్లికి తన తల్లిదండ్రులను ఒప్పించడానికి 9 ఏళ్ల పాటు వెయిట్ చేసిందట. అయితే శశాంక్ పెళ్లి జరిగేలా తనకు చూడాలి అంటూ సాయిబాబాకు అనసూయ మొక్కులు కూడా మొక్కునేదట.. అలా 11 గురువారాలపాటు పూజ చేసేదని తనకు ఇష్టమైన చాక్లెట్, ఆలుగడ్డ వంటి వాటిని కూడా వదులుకున్నదట అనసూయ. అలా ఏడేళ్ల పాటు వాటిని అసలు ముట్టుకోలేదని తెలిపింది. తమ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు కావడం చేత మొదట తనకి ఒక అబ్బాయి పుడితే బాగుంటుందనుకున్నానని అయితే రెండవసారి మాత్రం అమ్మాయి కావాలనుకున్నాను కానీ బాబే పుట్టాడు. అయితే తనకు ఆడపిల్ల కొనాలని కోరిక ఇప్పటికీ ఉందని 40 ఏళ్లు వచ్చిన కూడా తాను అమ్మ అయ్యేందుకు ట్రై చేస్తూ ఉంటానని తెలియజేసిందట అనసూయ. ప్రస్తుత ఈ విషయం అయితే అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.