టీవీ: ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ యష్మి లవ్ బ్రేకప్..!
ఈమె వాస్తవానికి బెంగళూరు, కర్నాటక ప్రాంతంలో జన్మించినప్పటికీ మోడలింగ్ వైపుకు అడుగులు వేసి చదువుకునే రోజుల్లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడిషన్స్ కి వెళ్ళిందట. అలా మొదటిసారి విద్యా వినాయక అనే సీరియల్ లో నటించే అవకాశం అందుకున్నదట. 2017లో ఈ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన యష్మి గౌడ్ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ స్వాతి చినుకులు, కృష్ణ ముకుంద మురారి, త్రినయని వంట సీరియల్స్ లో కూడా నటించిందట.
ఇటీవలే యష్మి గౌడ ఒక ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ గురించి తెలియజేస్తూ తాను ఒక అబ్బాయిని చాలా ఇష్టపడ్డానని అతను కూడా తను అంటే చాలా ఇష్టపడ్డారని ఇద్దరం కలిసి తమ ఆలోచనల గురించి షేర్ చేసుకున్నామని తెలియజేసింది.. కానీ ఒకరోజు ఉన్నట్టుండి మన ప్రేమని ఇంతటితో ఆపేద్దాం.. నువ్వు ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కావడంతో తమ కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పడంతో చాలా బాధపడ్డానని అయితే అతను చెప్పిన రీజన్ తనకు అర్థం కాలేదని.. అయినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేశానని తెలిపింది. కాని చివరికి తను తనని వదిలించుకోవడానికి ఇలాంటి రీజన్ చెప్పారని తనకు తెలిసిందని తెలిపింది యష్మి గౌడ. అలా బ్రేకప్ జరిగిపోయిందని తెలిపింది..ఇక తర్వాత వాటి గురించి అసలు పట్టించుకోలేదని తెలిపింది.