టీవీ: ఈ జబర్దస్త్ యాంకర్ కష్టాలు తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు..!

Divya
జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్స్ యాంకర్స్ సైతం వెండితెర పైన ఒక వెలుగు వెలుగుతున్నారు. యాంకర్ అనసూయ ప్రస్తుతం నటిగా మారిపోయి వరుస సినిమాలలో నటిస్తోంది. అలాగే రష్మీ కూడా గతంలో హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించడానికి సిద్ధమయ్యింది. మరొక యాంకర్ సౌమ్య రావు కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఇమే వచ్చిరాని తెలుగుతో ప్రేక్షకులను బాగానే నవ్విస్తూ ఉంటుంది.
అయితే ఈమె యాంకర్ గా జబర్దస్త్లు ఎక్కువ రోజులు కొనసాగలేదు.. ఆ తరువాత  సిరిహనుమంతు యాంకర్ గా చేస్తున్నది.. మొదట సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన సౌమ్య రావు తన కెరీర్ లో ఎన్నో కష్టాలను సైతం చవి చూసింది సౌమ్యరావు. అంత ఈజీగా యాంకర్ స్థాయికి రాలేదట. ఈ విషయాలను ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన జీవితంలో ఎదురైన కొన్ని కష్టాలను కూడా తెలియజేసింది సౌమ్యరావు.. తనకు తెలుగు రాకపోయినా తెలుగు సినీ ప్రేక్షకులు తనని చాలా ఆదరిస్తున్నారు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.

అలాగే తన తల్లి గురించి మాట్లాడుతూ మా అమ్మే గురువు, ఆమె సంగీతం నేర్పించింది మా కుటుంబం చాలా కష్టాలను చవి చూసింది.. ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తినడానికి తిండి లేక ఎవరైనా భోజనం పెడతారేమో అని ఎదురు చూశాము.. ఆ సమయంలో తన తల్లికి బ్రెయిన్ క్యాన్సర్ కూడా వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆకలితో అలమటించే వాళ్ళమంటూ తెలిపింది సౌమ్యరావు.. అందరూ తిన్న తర్వాత ఏదైనా మిగిలిందని ఎవరైనా తెచ్చి ఇస్తారా అని ఎదురుచూసే వాళ్ళమని తెలిపింది. ఈ కష్టాలే మా జీవితాలను కూడా మార్చేశాయని ఈ కష్టాలు తనని చాలా మానసికంగా బలంగా మార్చేలా చేశాయని తెలిపింది సౌమ్యరావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: