టీవీ: హౌస్ నుంచి బయటికి వచ్చేస్తున్న గంగవ్వ.. ఏం జరిగిందంటే..?
ఇప్పుడు గంగవ్వ మరొకసారి బిగ్ బాస్ సీజన్-8 కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇది చాలామంది ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా గంగవ్వను మళ్ళీ తీసుకురావడంతో చాలామంది షాక్కు గురయ్యారు. అంతేకాకుండా ఒక ఫిజికల్ టాస్క్ లో పాల్గొని గెలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో గంగవ్వ కేవలం మాటలకు మాత్రమే కాదు టాస్కులు కూడా పూర్తి చేస్తుందని చాలామంది కామెంట్స్ చేశారు. అందుకే హౌస్లో తోటి కంటెస్టెంట్ కూడా ఇమెను ఎలిమినేషన్ లిస్టు నుంచి మినహాయిస్తూ ఉన్నారు.
హౌస్ లో గంగవ్వకు మళ్ళీ అనారోగ్య సమస్యలు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నదంటూ గత శనివారం ఎపిసోడ్లో బిగ్బాస్ పోస్ట్ నాగార్జునతో చెప్పుకొని ఎమోషనల్ గా మాట్లాడింది గంగవ్వ.. దీన్నిబట్టి చూస్తే తనంతట తానే హౌస్ నుంచి బయటికి వెళ్ళేలా కనిపిస్తోంది తప్ప ఆడియన్స్ మాత్రం గంగవ్వని ఎలిమినేట్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదట. ఇలాంటి సమయంలోనే గంగవ్వ తన ఆరోగ్య సమస్యల మీద దృష్టి పెట్టడంతో సెల్ఫ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా హౌస్ నుంచి బయటికి వెళ్ళబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలిమినేషన్ లేకుండానే ఈమెను బయటికి పంపించే కార్యక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.