బిగ్ బాస్ షోలోపల జరిగేదంతా అలాంటి పనులేనంటూ బరస్టైనా సోనియా..!

FARMANULLA SHAIK
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సోనియా ఆకుల ఒకరు. పలు సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను గెల్చుకుంది.ఇదిలావుండగా 28వ రోజున ఎలిమినేట్ అయి బయటకి వచ్చేసింది సోనియా ఆకుల. అనవసరమైన నెగిటివిటి కొనితెచ్చుకోవడం వల్ల సోనియా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.అయితే ఏ కంటెస్టెంట్ కైనా సోషల్ మీడియా ట్రోలింగ్ తప్పదు. ఇప్పుడు సోనియా విషయంలోనూ అదే జరుగుతోంది. కొంద మంది నెటిజన్లు ఆమెను అదే పనిగా టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోనియాతో హౌస్ లో చనువుగా ఉంటోన్న నిఖిల్, పృథ్వీలతో ఆమెకు రిలేషన్ అంటగడుతున్నారు. ముఖ్యంగా సోనియా ఎలిమినేషన్‌కి నిఖిల్ ఫ్యాన్స్‌యే కారణమనే వాదన కూడా ఎక్కువ‌గా ఉంది. పృథ్వీ, నిఖిల్‌ల ఆటని సోనియా డిస్ట్ర‌బ్ చేస్తుంద‌నే టాక్ కూడా ఎక్కువ‌గా వినిపించింది. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాక సోనియా బిగ్ బాస్‌పై కూడా కొన్ని ఆరోప‌ణ‌లు చేసింది.కావాలని త‌న‌ని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేశారని అందుకు తగ్గట్లే ప్రోమోలు, ఎపిసోడ్స్ కట్ చేశారంటూ సోనియా ఆరోపించింది.తాజాగా ఆమె బిగ్ బాస్ విషయాలను మట్లాడుతూ బిగ్ బాస్ వలన నా ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే బిగ్ బాస్ నన్ను రోడ్డున పడేసాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

నేను హౌస్ లో విష్ణు ప్రియను టార్గెట్ చేశాను అని చూపించారు.కానీ విష్ణునే నన్ను టార్గెట్ చేసింది.నిఖిల్ డిప్రెషన్ లో ఉన్నాడు.అందుకే స్నేహం చేశాను, అడ్వైజ్ ఇచ్చాను.తాను నా ఫ్యామిలా భావించాను.నేను హౌస్ లో ఏ తప్పు చెయ్యలేదు.కానీ నా మాటలను ఇష్టం వచ్ఛినట్టుగా ఎడిట్ చేసి చూపించడం తప్పు.నేను బయట ఎవ్వరికైనా అడ్వైజ్ ఎలా ఇస్తానో, నిఖిల్, పృథ్వీలకు అలానే ఇచ్చాను.అది తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం.గేమ్ లో నిఖిల్, పృథ్వీలను చూడకు నా గేమ్ చూడు అని యష్మితో అన్నాను.కానీ అది తప్పుగా చూపించారు.నాగార్జున గారు కూడా సపోర్ట్ చెయ్యలేదు.అక్కడ నీ నిజాయితీ ఏమైపోయింది, అప్పుడే నాకు హౌస్ లో ఉండాలనిపించలేదు.నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను, యష్ అనే అబ్బాయిని వివాహం చేసుకోబోతున్నాను.యష్ తండ్రి నేను హౌస్ లో ఉన్నప్పుడు నా కోసం క్యాంపైన్ చేసారు అంటూ సోనియా తన ఇమేజ్ బిగ్ బాస్ లో డ్యామేజ్ అయినట్లుగా చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా సోనియా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: