టీవీ: ఆదిరెడ్డి పై సోనియా ఫైర్.. విస్తుపోయె నిజాలు చెప్పిన సోనియా..!
బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సోనియా పేరు బాగానే వినిపిస్తూ ఉండడానికి ముఖ్య కారణం పలు రకాల ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో పైన సోనియా ఆరోపణలు కూడా పెను సంచలనాలకు దారి తీసాయి. తన మాటలను ఇష్టం వచ్చినట్లుగా కూడా ఎడిట్ చేసి చూపించారని ఆమె ఫైర్ అయ్యింది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన రివ్యూవర్ ఆదిరెడ్డి పైన కూడా ఈమె ఫైర్ అయ్యింది.
రివ్యూల పేరుతో తనను చాలా కించపరిచేలా చేశారంటూ ఆది రెడ్డి పైన కేసు పెట్టినట్లుగా కూడా తెలిపింది సోనియా ఆకుల. తన వల్ల నెల రోజులపాటు రివ్యూవర్లు చాలా బతికిపోయారని.. తన గురించి కూడా ఎన్నో వీడియోలు చేసుకుంటూ చాలామంది బాగానే వెనకేసుకున్నారంటూ తెలిపింది సోనియా. బిగ్ బాస్ షో కూడా తన వల్ల 30 రోజులపాటు రేటింగ్ తో బతికిపోయింది అంటూ తెలిపింది. ఇలా ఇంతమందికి ఆదాయం ఇచ్చిన తనకు చాలా ఆనందంగా ఉందని తన వల సుమారుగా 40 మంది కొత్త మంది యూట్యూబ్లో కూడా బతికిపోయారు అంటూ తెలిపింది. ప్రస్తుతం సోనియా ఆకుల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.