
వావ్: భగత్ సింగ్-సుభాష్ చంద్రబోస్లా.. ఎన్టీఆర్ -రామ్ చరణ్..!
కచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్లు ఈ హీరోలకు పడితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం కావడం ఖాయం అంటూ తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సనతో ఆర్సి 16 సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ కూడా నటిస్తోంది. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో వార్ 2 సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. విజయ్ సేతుపతి సినిమా విషయానికి వస్తే ఇటీవలే విడుదలై 2 చిత్రంతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప 2 చిత్రంలో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అనుష్క ఘాటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నది. ఈ సినిమా కూడా అది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. మొత్తానికి అభిమానులతో ఈ వీడియో శభాష్ అనిపించుకునేలా ఉండగా మరికొంతమంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.