టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటన, అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. అచ్చ తెలుగు అమ్మాయి జయప్రద. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ రాణించింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ ఇలా మొత్తంగా అన్ని భాషలలో కలిపి 300కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జయప్రద 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.
తన చదువు కొనసాగిస్తున్న సమయంలో స్కూల్లో నాట్య ప్రదర్శన చేసింది. ఆ సమయంలో నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి జయప్రద నాట్య ప్రదర్శన, అందం చూసి తనకు సినిమాలలో అవకాశాన్ని ఇచ్చాడు. తన చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అతి చిన్న వయసులోనే భూమి కోసం అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జయప్రద వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంది. తన సినిమాల ద్వారా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదట తాను సినిమాలో నటించినందుకు ఒక్కో సినిమాలో రూ. 10 రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేదట. అగ్ర హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించింది. సినిమాల్లో తన హవాను కొనసాగిస్తున్న సమయంలోనే జయప్రద రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
రాజ్యసభ సభ్యురాలిగా కూడా పని చేసింది. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీలో చేరింది. జయప్రద రాంపూర్ నుంచి లోక్ సభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జయప్రద బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయప్రద ఓటమి పాలయ్యారు. కాగా, ప్రస్తుతం జయప్రద ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ఉండడం విశేషం.