
"ఓజి" ఇంటర్వెల్ సీన్ పీక్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే..?
అది ఏంటి అంటే జనానికి అన్యాయం చేసిన పోలీస్ ఆఫీసర్ ను పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లోనే కొట్టి వాడి తల నరికి పోలీస్ స్టేషన్ నుంచి నుంచి బయటికి వస్తుంటారట. ఇక దాంతో ఇంటర్వెల్ పడుతుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. మరి ఈ సీన్ కనుక ఇలాగే ఉన్నట్టయితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనేది మాత్రం చాలా క్లారిటీగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేసి చూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా చాలా బాగుంటుందని ఒక సందర్భంలో చెప్పడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక దర్శకుడు సుజీత్ కూడా ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తుండటం విశేషం.ఇదిలావుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.