బిగ్ బాస్.. రీయంట్రీ లో కూడా భారీ డిమాండ్.. గంగవ్వ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Divya
బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ప్రేక్షకుల లో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 8వ సీజన్ దిగ్విజయంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎనిమిదవ సీజన్లో భాగంగా 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 6వ వారం కూడా చివరి దశకు చేరుకోబోతోంది. ఇక పోతే ఆరవ వారంలో భాగంగా గంగవ్వ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక పోతే వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా హౌస్ లోకి 8 మంది అడుగుపెట్టడంతో ఆట మరో లెవెల్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోందని చెప్ప వచ్చు.  ముఖ్యంగా ఈ వైల్డ్ కార్డు ద్వారా గంగవ్వ, హరితేజ, రోహిణి, నయని పావని, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ ఇలా మొత్తం ఎనిమిది మంది అడుగుపెట్టారు.ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా గత సీజన్లలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ అన్న సంగతి తెలిసిందే.. వీరందరికీ ఇది మరొక చాన్స్ లాంటిదని కూడా చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ సీజన్ ఫోర్ లో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.
అయితే సీజన్ 4 లో  అనారోగ్యానికి గురికావడంతో వెంటనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈసారి మాత్రం మీరు పంపించినా వెళ్ళను అంటూ భీష్ముంచుకు కూర్చుంది గంగవ్వ. ఈ నేపథ్యంలోనే ఈమె క్రేజ్ కాస్త బాగా పెరిగిపోవడంతో ఎంత పారితోషకం తీసుకుంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  తాజాగా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు వారానికి రూ.3.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే  గంగవ్వ రెమ్యూనరేషన్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: