టీవీ: బిగ్ బాస్ -8 హౌస్ లో మళ్లీ బలయ్యేది ఆడవారేనా..?
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు మొదట్లో పరవాలేదు అనిపించుకున్న సోనియా రాను రాను ఈమె మాటల తీరు ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదట.. విష్ణుప్రియ సరదాగా సోనియాను నీకు నిఖిల్ తో స్నేహం ఎలా ఏర్పడిందని అడగగా..ఆమె వెంటనే విష్ణు ప్రియ పైన ఫైర్ అయ్యింది.. ముఖ్యంగా తన గురించి బయట తప్పుగా రాస్తారని తన కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు అంటూ సోనియా రెచ్చిపోయింది.. కానీ హౌస్ లో సోనియా, పృథ్వి ,నిఖిల్ తో చేసే వ్యవహారం గురించి బిగ్బాస్ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా హగ్గులు మీద హగ్గులు వ్యవహారం వల్ల అందరికీ కోపం తెప్పించేలా చేసింది సోనియా.. ముఖ్యంగా నిఖిల్, పృద్వి, అభయ్ తో సోనియా ఆడిన గేమ్ కూడా ప్రేక్షకులకు కోపాన్ని తీసుకువచ్చేలా చేసింది. దీంతో అందరూ కూడా సోనియానే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఆమెని నామినేషన్ చేసే పాయింట్స్ లో కూడా పృథ్వి, నిఖిల్ ను అడ్డుపెట్టుకొని మరి గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే మొదట్లో మాట్లాడిన మాటలకు సోనియా ప్రస్తుతం చేస్తున్న చేష్టలకు పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు ఈమె పైన కాస్త అసహనంతో ఉన్నారు.అందుకే ఈవారం నామినేషన్ లో ఉన్న సోనియాని సైతం సేవ్ చేయడానికి ప్రేక్షకులు సైతం మద్దతు తెలపలేదట.. నామినేషన్ లో ఉన్న ఆరుగురులో 40 శాతం ఓటింగ్ కేవలం నాబిల్ కే దక్కింది.