టీవీ: ఆ డైరెక్టర్ రేప్ చేశారు.. బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు..!

frame టీవీ: ఆ డైరెక్టర్ రేప్ చేశారు.. బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు..!

Divya
తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి నటి గా పేరు సంపాదించింది నటి జయలలిత. నేటితరం సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన జయలలిత అప్పట్లో హీరోయిన్గా కూడా నటించింది. అలాగే ఎక్కువగా వ్యాంపు పాత్రలలో కూడా నటించింది. కానీ బుల్లితెర పైన మాత్రం మంచి పాత్రలలోనే నటించి బాగానే అలరించింది. ప్రేమ ఎంత మధురం, బంగారు గాజులు వంటి సీరియల్స్ లో కూడా నటించింది జయలలిత. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జయలలిత తనకు జరిగిన ఒక అన్యాయం గురించి తెలియజేసింది.


తాను సినిమాలలో నటిస్తున్న సమయంలో మలయాళంలో ఒక సినిమా చేసేందుకు మొదటిసారి వెళ్ళిందట. అందులో రేప్ సన్నివేశం గురించి వివరించాలని డైరెక్టర్ గదిలోకి రమ్మన్నారనీ.. కానీ గదిలోకి వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రూమ్ తలుపులు వేశాడని తెలిపింది. తాను ఎంత ప్రయత్నించినా కూడా అక్కడి నుంచి తప్పించుకోలేకపోయానని అప్పుడే రేప్ చేశాడని..ఈ విషయాన్ని ఇంతవరకు తాను ఎక్కడ చెప్పలేదని తెలియజేసింది నటి జయలలిత. కానీ తనని అలా చేసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరు నెలలకి మరణించారంటూ తెలిపింది..

అలాగే అదే ఇంటర్వ్యూలోనే తాను అమ్మ జయలలిత పేరు పెట్టుకొని వ్యాంపు పాత్రలలో నటించడం వల్ల చాలామంది ఆమె అభిమానులు తన పైన ఆగ్రహానికి గురయ్యారని కొన్ని సందర్భాలలో తన ఇంటి మీద కూడా దాడులు చేశారంటూ జయలలిత వెల్లడించింది. అలాగే చిరంజీవి నటించిన ఖైదీ చిత్రంలో కూడా తనకు హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిన చేయలేకపోయాన.. అందుకు కారణం కూడా వ్యాంపు పాత్రలే అంటూ తెలియజేసింది జయలలిత. వీటితో పాటు కే విశ్వనాథ్ గారి బంధువులతో కూడా పెళ్లి జరగాల్సి ఉండగా అది కూడా చెడిపోయిందని.. కేవలం కుటుంబ పోషణ కోసమే తాను తనకొచ్చిన పాత్రలన్నిటిలో కూడా నటించాను అంటూ తెలియజేసింది జయలలిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: