టీవీ: ఆ స్టార్ డైరెక్టర్ ఇంటికి రమ్మన్నారంటూ.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ..!

Divya
ఈ నెలలో బిగ్ బాస్ -8 సీజన్ మొదలయ్యింది. ఇందులో చాలా మంది సీరియల్ ఆర్టిస్టులతో పాటు, బాగా పాపులారిటీ సంపాదించిన వారు ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారమే బేబక్క ఎలిమినేట్ అయ్యింది. అయితే సినిమాల నుంచి వెళ్లిన వారిలో సోనియా ఆకుల కూడా ఒకరు. ఈమె హీరోయిన్గా పలు చిత్రాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో కలసి కరోనా వైరస్ అనే చిత్రంలో కూడా నటించింది. 2019 లో వచ్చిన జార్జి రెడ్డి అనే సినిమా ద్వారా పేరు సంపాదించుకుంది.

ఆ తర్వాత ఆశ ఎన్కౌంటర్ అనే చిత్రంలో కూడా నటించింది. అయితే ఇవన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ప్రస్తుతం బిగ్ బాస్ 8వ సీజన్లోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా హౌస్ లో నిఖిల్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళకముందు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కరోనా సమయంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనియా ఆకుల మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ సినిమాలలో నటించాలంటే చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా ఆలోచిస్తారంటూ తెలిపింది..

ఎందుకంటే ఆయన చిత్రాలలో ఎక్కువగా బోల్డ్గానే కనిపిస్తూ ఉండాలి. కరోనా వైరస్ సినిమా సమయంలో ఆర్జీవి ఫ్యామిలీ తరహా సినిమా చేస్తున్నారని చాలామంది ఆశ్చర్యంగా చూశారని సోనియా వెల్లడించింది. అయితే ఆ సమయంలోనే తనని ఒకసారి ఇంటికి రమ్మని వర్మ పిలిచారని తెలిపింది సోనియా. అయితే ఆ సమయంలో తనకు ఎన్నో రకాల డౌట్లు మొదలయ్యాయని.. మోసం చేయడానికా , అసభ్యకరంగా ప్రవర్తించడానికి అనే డౌట్లు కూడా తనకు వచ్చాయని తెలిపింది సోనియా. కానీ తను అనుకున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదని వెల్లడించింది. అయితే ఈ విషయాలన్నీ కూడా రాంగోపాల్ వర్మ ముందే మాట్లాడడం జరిగిందట సోనియా. ప్రస్తుతం ఇమే చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: