టీవీ:KBC షోకి అమితాబచ్చన్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..!

Divya
బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబచ్చన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇటీవలే కల్కి సినిమాలో కూడా అశ్వద్ధామ పాత్ర అద్భుతంగా నటించారు. గత కొన్నేళ్ల నుంచి కౌన్ బనేగా కరోడ్ పతి అనే షోకి కూడా అమితాబచ్చన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ అభిమానుల కోరిక మేరకు..16 వ సీజన్ కి సైతం తిరిగి మళ్లీ అమితాబచ్చన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. KBC షో ప్రజాదరణ బాగానే పొందింది.. ఈ కార్యక్రమానికి అమితాబచ్చన్ తప్ప ఎవరూ కూడా హోస్ట్ కాదని అటు అభిమానులు నేటిజెన్స్ కూడా నమ్ముతున్నారు.

KBC -16 కోసం ఒక్కో ఎపిసోడ్ కు ఎంత తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే వెడబడలేదు కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం KBC -16 కోసం ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కోసం ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కౌన్ బనేగా కరోడ్ పతి ఓకే మొదట రూ.25 లక్షల రూపాయలు ఒక ఎపిసోడ్కి తీసుకునేవారట.. ఇప్పుడు 16వ షోకి ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

KBC -16 ఈ వారం సోనీ టీవీలో ప్రసారం కాబోతోంది. మొదటి ఎపిసోడ్ సమయంలో బిబి ఉద్వేగానికి లోనవ్వడమే కాకుండా..KBC లో తన ప్రయాణాన్ని కూడా తెలియజేశారు. అలాగే అతనికి మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ కూడా ఒక సందేశం తెలియజేశారు అమితాబ్ బచ్చన్. తనతో ఇన్నేళ్లపాటు నడిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎలాంటి పదాలు సరిపోవడంలేదని .కౌన్ బనేగా కరోడ్ పతి తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిందని అదంతా కూడా మీ ప్రార్ధనల వల్లే జరిగింది అంటూ ధన్యవాదాలు తెలియజేశారు. మళ్లీ మీ మధ్య కనిపించేందుకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతనీ అంటూ తెలిపారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ రెమ్యూనరేషన్   వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: