టివి: మొదటిసారి పెళ్లిపై స్పందించిన యాంకర్ శ్రీముఖి..!

Divya
తెలుగు బుల్లితెర పై యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న శ్రీముఖి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముద్దుగా అభిమానులు ఇమెను బుల్లితెర రాములమ్మగా పిలుచుకుంటూ ఉంటారు.. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాలుగా గ్రామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. దీంతో సోషల్ మీడియాలో కూడా భారీగానే పాపులారిటీ సంపాదించుకుంది. నిత్యం ఏదో ఒక విషయంలో మాత్రం ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటుంది శ్రీముఖి. అయితే శ్రీముఖి పెళ్లి గురించి మాత్రం తరచూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

గడచిన కొన్ని నెలల నుంచి శ్రీముఖి పెళ్లి అతనితో జరుగుతోంది.. ఇతనితో  జరగబోతోంది అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ పెళ్లి విషయమే హాట్ టాపిక్ గా మారుతోంది.ఏకంగా ఈసారి శ్రీముఖి తన పెళ్లి వార్తల పైన స్పందించి పలు రకాల విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది.. గడిచిన కొద్దిరోజులుగా శ్రీముఖి ఒక హీరోతో ప్రేమలో ఉందని త్వరలోనే ఆ హీరోని పెళ్లి చేసుకోబోతోంది అంటూ రాములమ్మది కూడా ప్రేమ వివాహమంటే చాలా దారుణంగా ట్రోల్ చేయగా.. ఈ విషయం పైన స్పందించింది.. అన్ని వట్టి రూమర్స్ అని తెలిపింది..

శ్రీముఖి మాట్లాడుతూ.. తనలో ఎలాంటి లోపం లేదని తానే కావాలని పెళ్లికి కొద్దిగా దూరంగా ఉన్నానని తెలిపింది. అంతేకాకుండా తన పెళ్లి చేసుకుని సమయం కూడా త్వరలోనే చెబుతానని కచ్చితంగా వరుడుని అందరికీ పరిచయం చేసిన తర్వాతే వివాహం చేసుకుంటానని తన మీద వచ్చే రూమర్స్ మాత్రం నమ్మకండి అంటూ శ్రీముఖి తెలియజేసింది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర పైన వెండితెర పైన భారీగానే క్రేజ్ సంపాదించి తనకు వచ్చిన ఎలాంటి అవకాశాన్ని అయినా సరే వదులకుండా నటిస్తూ ఉంటుంది శ్రీముఖి. ప్రస్తుతం ఒక్కో షో కి రూ .2.5 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: