రీతూ చౌదరిని ఫైనల్ గా నీ ఆట మాకు నచ్చలేదు తల్లీ..నువ్వు బయటికి వస్తేనే మంచిది అని ప్రేక్షకులు అనుకున్నారో ఏమో కానీ ఎలిమినేట్ చేసి పడేశారు. ఆడియన్స్ దెబ్బకి రీతూ చౌదరి బయటికి వచ్చేసింది. అయితే హౌస్ నుండి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ హౌస్ బజ్ లో శివాజీ హౌస్ లో ఆడిన గేమ్ గురించి, రిలేషన్ల గురించి, గొడవల గురించి అడుగుతూ ఉంటారు.ముఖ్యంగా శివాజీ అక్కడికి వచ్చిన వారిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రీతు చౌదరి శివాజీ కి సంచలన విషయాలు తెలిపింది. ఇక స్టేజ్ మీదకి రావడంతోనే బోర్డు మీద ఉన్న వారిలో ఎవరికి ఏ ర్యాంకు ఇస్తారని నాగార్జున అడగగా.. డిమాన్ కి ఫస్ట్ ర్యాంకు ఇవ్వగా.. ఇమ్మానియేల్, తనూజ,కళ్యాణ్ ఈ ముగ్గురిలో 2,3,4 మీ ఇష్టం ఎవరైనా తీసుకోండి అని వారికే వదిలేసింది.
ఆ తర్వాత సంజన కి 5th ప్లేస్,సుమన్ శెట్టి కి 6th ప్లేస్,భరణి కి 7th ప్లేస్ ఇచ్చేసి అందరికీ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది.ఆ తర్వాత శివాజీ చేసిన ఇంటర్వ్యూలో డిమాన్ పవన్ తో ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది. డిమాన్ పవన్ తో నువ్వు అంత క్లోజ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో బయట చాలా బ్యాడ్ టాక్ వచ్చింది.మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్టు, ఎఫైర్ ఉన్నట్లు కూడా మాట్లాడుకున్నారు.దీని గురించి మీ స్పందన ఏంటి.. అసలు డిమాన్ తో మీకున్న రిలేషన్ ఏంటి అని శివాజీ ప్రశ్నించగా.. డిమాన్ తో నాకు ఎలాంటి లవ్ ఎఫైర్ లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే.మా మధ్య ఉంది ఫ్రెండ్షిప్ మాత్రమే.
నేను ఆడ, మగ ఎవరితోనైనా సరే ఒకసారి కనెక్ట్ అయితే ఇంతే క్లోజ్ గా ఉంటాను. మా రిలేషన్ ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. డిమాన్ పవన్ తో ఫ్రెండ్షిప్ తప్ప ఎలాంటి రిలేషన్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రీతూ చౌదరి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలా మంది నెటిజెన్లు హౌస్ లో ఉన్నప్పుడేమో డిమాన్ నా జీవితం.. నా లైఫ్.. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇలాంటి వాడినే భర్తగా కోరుకుంటాను అని డిమాన్ చెవిలో కాలీఫ్లవర్ పెట్టి బయటికి వచ్చాకనేమో మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని ప్లేట్ ఫిరాయిస్తావా అంటూ రీతూ చౌదరిని ఆడేసుకుంటున్నారు.