టీవీ: అయ్యో వంటలక్క రియల్ లైఫ్ పరిస్థితి ఇంత దారుణమా..!!

Divya
తెలుగు సీరియల్స్ లో అగ్రస్థానం సంపాదించుకున్న సీరియల్ కార్తీకదీపం సీరియల్ కు ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో వంటలక్కగా డాక్టర్ బాబు ఎంతోమంది హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.. ప్రేమి విశ్వనాథకు పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈమె తన పర్సనల్ లైఫ్ గురించి ఇటీవలే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం..

కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకాదరణ పొందిన ప్రేమి విశ్వనాధ్...(వంట లక్క) గా సుపరిచితమే.. అలాగే ఇందులో డాక్టర్ బాబుగా నిరూపమ్ ..మౌనిత పాత్ర అందరిని ఆకట్టుకుంటాయి.. ప్రేమి విశ్వనాథ్ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే 1991 డిసెంబర్ 2న కేరళలో ఈమె జన్మించింది. ఈమె తండ్రి విశ్వనాథ్ తల్లి పేరు కాంచన.. ప్రేమి విశ్వనాథ్ ఒక ప్రైవేట్ సంస్థకు లీగల్ అడ్వర్టైజర్ గా కూడా వర్క్ చేసిందట. సీరియల్స్ లోకి రాకముందు మోడల్గా కూడా పనిచేస్తుందట. అలాగే ఒక చిత్రంలో కూడా నటించినట్లు వెల్లడించింది.. ప్రేమి విశ్వనాథ్ కు ఒక అన్నయ్య కూడా ఉన్నారని ఆయన ఫేమస్ ఫోటోగ్రాఫర్ అంటూ తెలియజేసింది.

సీరియల్స్ లోకి వచ్చిన తర్వాత తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగిందని మొదట కేరళ రాష్ట్రానికి చెందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించాను ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నానని తెలిపింది..ఈమె పర్సనల్ విషయాన్నీ తెలియజేస్తూ తన భర్త పిల్లలు గురించి మాట్లాడుతూ కెరియర్ కోసం నేను నా పిల్లల్ని కూడా వదిలి తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చేసాను తన భర్త దగ్గర అసలు ఉండటానికే సమయమే దొరకలేదని చెప్పింది.. అలా ఉండకపోతే మీ భర్తకు కోపం రాదా అని యాంకర్ అడగగా.. నిజం చెప్పాలంటే నేను కేరళలో ఉన్నప్పుడు ఆయన అసలు అక్కడ ఉండరని హైదరాబాదులో ఉన్నప్పుడు ఆయన హైదరాబాదులో ఉండరని.. అలా తాను ఒక రాష్ట్రంలో నేను మరొక రాష్ట్రంలో ఉంటానని తన భర్త తనకన్నా బిజినెస్ లైఫ్ని ఎక్కువగా గడిపేస్తూ ఉంటారని ఎప్పుడో ఒకసారి మాత్రమే కలుస్తూ ఉంటామని ప్రేమి విశ్వనాథ్ తెలియజేసింది..ఈ విషయం తెలిసి అభిమానులు ఫన్నీగా వంటలక్క పరిస్థితి రియల్ లైఫ్ లో ఇంత దారుణంగా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: