టీవీ: బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగిపోయిందా..!!

Divya
నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్టుగా వ్యవహరించి నటువంటి షో అన్ స్టాపబుల్.. ఈ షో చేయకముందు వరకు కేవలం హీరోగా బాలకృష్ణ ఎంతో మంది అభిమానులను సంపాదించారు. అయితే ఎప్పుడైతే ఈ షోని చేయడం మొదలుపెట్టారో బాలయ్య లో మరో కోణాన్ని అభిమానులు గుర్తించడం జరిగింది. హోస్ట్ గా ఈ షో కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అయితే లభించింది. ఇప్పటికే రెండు సీజన్లను సైతం విజయవంతంగా పూర్తి చేసుకొని మూడవ సీజన్లోకి సిద్ధమవుతోంది.. గడచిన కొద్ది రోజుల క్రితం సీజన్-3 ప్రారంభం కాకముందే భగవంతు కేసరి యానిమల్ చిత్రాలకు సంబంధించి పలు రకాల ప్రమోషన్స్ సైతం ఈ షోల స్పెషల్ ప్రోగ్రామ్స్ గా వేయడం జరిగింది.
అన్ స్టాపబుల్ మూడవ సీజన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఈ షో గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ టాక్ షో ఆగిపోయిందని సందేహాలు కూడా అందరిలో కలుగుతున్నాయి. అయితే అలా రావడం వెనుక కారణం ఏమిటంటే.. ఈ షో మొత్తం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్ సెట్ వేసి చేస్తూ ఉండేవారట.

ఇప్పుడు ఆ సెట్ ను హఠాత్తుగా అక్కడి నుంచి తొలగించేసారని దీంతో ఈ షో ఆగిపోయిందని ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతోంది..అన్ స్టాపబుల్ అంటే ఎవరూ లేప లేనిదే అని పూర్తి అర్థం.. కాని ఈ షోకి మాత్రం ఆగిపోయింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొనడానికి సిద్ధమయ్యారు.. రాజకీయాలు దగ్గర పడుతున్న సమయంలో బాలయ్య కొద్ది రోజులు ఇలాంటి షోలను పోస్ట్ ఫోన్ చేశారేమో అంటూ పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: