టీవీ: డేంజర్ జోన్ లో పడ్డ టైటిల్ ఫేవరెట్.. ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?
ఇక నాలుగో వారానికి సంబంధించి ఇందులో కొంతమంది భారీ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ షో ద్వారానే వెలుగులోకి వచ్చిన ప్రిన్సి ఎక్కువ ఓట్లు సాధించినట్లు సమాచారం. ఇక అతడు ఒక్కడే ఏకంగా 30% వరకు ఓటింగ్ నమోదు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదటి రెండు రోజుల్లో ఓటింగ్ కొంచెం విభిన్నంగా ఉన్నా.. తర్వాతి రెండు రోజుల్లో పూర్తిగా ఓటింగ్ మారిపోయిందనే చెప్పాలి. ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో శుభ శ్రీ, మూడవ స్థానంలో గౌతం కృష్ణ, నాలుగవ స్థానంలో ప్రియాంకలు ఉన్నట్లు సమాచారం. వీళ్ళందరూ దాదాపుగా సేఫ్ అయినట్లే.. ఇక ఐదవ స్థానంలో తేజ ఉండగా.. ఆరవ స్థానంలో టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన రతికా రోజ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
హౌస్ లోకి వచ్చిన కొద్ది రోజులకే టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్న ఈమె ఇప్పుడు ఎలిమినేషన్ ప్రమాదంలో పడిందని చెప్పవచ్చు. ఒకవేళ ఓటింగ్ కి ఇంకా రెండు రోజులు సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా జరిగే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా నిన్న మొన్నటి వరకు శుభశ్రీ ఆరవ స్థానంలో కొనసాగుతూ డేంజర్ జోన్ లో పడగా.. నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్స్ గమనిస్తే చాలామంది ఆమెకు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఇక టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్న రతిక ఈ వారం సేఫ్ అవుతుందా లేక ఎలిమినేట్ అవుతుందా చూడాలి.