టీవీ: అతడిని తలుచుకొని ఎమోషనల్ అవుతున్న పంచ్ ప్రసాద్.. కారణం..?

Divya
బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని.. అందరి మీద రకరకాల పంచులు వేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కామెడీ షో లలో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన జబర్దస్త్ లోకి వచ్చినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన రెండు కిడ్నీలు పాడయ్యాయని కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తే తప్ప బ్రతికే అవకాశాలు లేవని వైద్యులు చెప్పినట్లు పంచ్ ప్రసాద్ అందరికీ చెప్పి షాక్ ఇచ్చారు.
ఇకపోతే తన భార్య తనకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అందుకు అవసరమయ్యే డబ్బు తమ దగ్గర లేదు అని, దయచేసి దాతలు ఎవరైనా సహాయం చేయాలి అని ఆయన కోరారు. అంతేకాదు ఆయన స్నేహితులు నూకరాజు, ఇమ్మానుయేల్ కూడా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అందరికీ తెలియజేసి సహాయపడమని కోరగా దీనిపై స్పందించిన రోజా తన పలుకుబడిని ఉపయోగించి.. సీఎం జగన్ సహాయంతో పంచ్ ప్రసాద్ చికిత్సకు కావలసిన వైద్య సదుపాయాలను ఆమె సమకూర్చారు. ఇక తాజాగా సర్జరీ తర్వాత మొదటిసారి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న పంచ్ ప్రసాద్ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అవడం ఇక్కడ అందరినీ బాధ పెట్టింది.
పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలేదు. అయితే ఇప్పుడు నాన్న అయిన తర్వాతే నాకు నాన్న విలువ ఏంటో అర్థం అవుతుంది.  ముఖ్యంగా నాకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు తానే నాకు తండ్రి అయ్యాడు.. నాకు తండ్రి లేడు అన్న విషయాన్ని గుర్తుచేసుకొని బాధపడిన ప్రతిసారి నీకు నేనున్నాను.. నీకు ఏమీ కాదు అంటూ నా కొడుకు ఎన్నోసార్లు నాకు ధైర్యం చెప్పారు అంటూ అటూ తన తండ్రిని ఇటు కొడుకును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు పంచ్ ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: