రోబో యాంకర్లు: న్యూస్ యాంకర్లకి దెబ్బ తప్పదా?
కొంతమంది పాయింట్ గా లీడ్ తీసుకుని మాట్లాడే వారు ఉంటారు. ప్రజెంటర్ మాత్రం డిఫెరెంట్ గా ఉంటారు. యాంకర్లకు చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం పెరిగిన టీవీ చానళ్లతో యాంకర్లకు కూడా మంచి ఉద్యోగాలతో పాటు ఎక్కువ జీతాలు కూడా వస్తున్నాయి. ఇలా అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ రాకతో యాంకర్ల ఉద్యోగాలకు దెబ్బ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒరిస్సాలోని ఓ టీవీ చానల్ కృత్రిమ మేధ ద్వారా యాంకర్ తో వార్తలు చదివించడం సంచలనంగా మారింది. తెలుగులో బిగ్ టీవీ కూడా ఈ ప్రయోగం చేసింది. రోజూ ఇదే తరహలో వార్తలు చదివితే యాంకర్ల ఉద్యోగాలు పోయేలా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా యాంకర్లకు మేకప్, రవాణా, జీతాలు ఇలా ఎన్నో ఖర్చులు ఆయా మీడియా, ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు చెల్లిస్తుంటాయి. కానీ కృత్రిమ యాంకర్ తో వార్తలు చదవడం అలవాటు చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ చేయడం పై ఆయా సంస్థలు దృష్టి పెడుతున్నాయి.
ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ తో యాంకర్ల అవసరం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డిబేట్లు కూడా ఎలా చేయడం నేర్పిస్తారో చూడాలి. దీంతో ఆయా కంపెనీలకు ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ వైపు చూసే అవకాశం ఉంది. మరి దీని దెబ్బకు ఎంతమంది ఉద్యోగాలు ఊడతాయో రాబోయే కాలంలో తేలనుంది.