TV: జబర్దస్త్ నుంచి కమెడియన్స్ దూరం అవడానికి కారణం ఇదేనా..?

Divya
బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతున్నా కూడా జబర్దస్త్ షో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ షో మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవడమే కాదు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తోంది..ముఖ్యంగా ఎంతోమంది కమెడియన్లకు జీవితాన్ని అందించిందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఒక మంచి స్టేజిని వదిలి చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉన్నట్టుండి ఇలా కమెడియన్స్ , జడ్జిలు ఒకరి తర్వాత ఒకరు మారుతూ ఉండడం పై ఎప్పటికప్పుడు కొత్త రూమర్లు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్లు మంచి గుర్తింపు ఉన్న వాళ్ళు దూరం అవడంతో ఈ షో రేటింగ్ పై కూడా ప్రభావం చూపుతోందని సమాచారం.  వాస్తవానికి ఇలా కమెడియన్లు వెళ్లిపోవడానికి కారణం షో నిర్వాహకులు వారికి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం లేదని.. అందుకే కమెడియన్లు కూడా ఇతర షోల పైన దృష్టి పెడుతున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ లో చేస్తున్న కమెడియన్లకు ఇతర షోల నిర్వహకులు ఎక్కువ మొత్తంలో పారితోషకం ఆఫర్ చేస్తూ ఉండడంతో ఇతర షోలపై దృష్టి పెడుతున్నారు.

గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం జబర్దస్త్,  ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల రేటింగులు ఈమధ్య కాలంలో ఊహించని విధంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే సుడిగాలి సుదీర్ తో పాటు చాలామంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. అయితే వెళ్లిన వారిలో చాలామంది జబర్దస్త్ లో జరిగే విషయాలను బయటకు చెబుతూ జబర్దస్త్ ను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి టైమ్ లో ఉన్న కమెడియన్లు షో లోనే కొనసాగుతారా లేక వీరు కూడా వెళ్ళిపోతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: