TV: ఈ బుల్లితెర క్వీన్ కి కలిసొచ్చినట్టేనా?
కన్నడ, తమిళ్ , తెలుగు అంటూ భాష ఏదైనా సరే తన హావభావాలతో మెప్పిస్తూ బుల్లితెర క్వీన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.. డాక్టర్ కావాలి అనుకున్న ఈమె చివరికి సౌత్ సినిమాలలో యాక్టర్ గానే మిగిలిపోయింది. 2011లో తంగిలి అనే కన్నడ సీరియల్ లో నటించే అవకాశం రావడంతో అలా తన కోరికను కాస్త పక్కన పెట్టి యాక్టర్ గా మారిపోయింది. ఇక తెలుగులో నా పేరు మీనాక్షి , కంటే కూతుర్నే కనాలి, ఆమె కథ వంటి సీరియల్స్ చేసి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయింది.
ఒకవైపు సీరియల్స్ లో విపరీతమైన క్రేజ్ లభించడంతో బుల్లితెరపై కూడా కొన్ని టీవీ షోలలో అవకాశాన్ని దక్కించుకొని.. అక్కడ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీ అందుకుంది. ఇటీవలే వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమె మొన్నా మధ్య బుట్ట బొమ్మ చిత్రంలో మెరిసింది. ఇప్పుడు ఇంటింటి రామాయణం సినిమాలో హీరోయిన్గా నటించి మంచి పేరు దక్కించుకుంది. మొత్తానికైతే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అంటూ తేడా లేకుండా అదరగొట్టేస్తూ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ అందరితో ఇట్టే కలిసిపోతుంది.