టీవీ: తెలుగు నటీమణులను పట్టించుకునే నాధుడే లేడు - మధు రెడ్డి..!

Divya
బుల్లితెరపై పలు చానల్స్ రకరకాల టీవీ సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యి ..భారీ టీఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్న నా పేరు మీనాక్షి సీరియల్ కూడా ఒకటి. ఇందులో గౌతమి అనే నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించి తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మధు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా సీరియల్స్ లో పెద్దగా కనిపించని ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చేస్తూ కాలం వెళ్ళదీస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీరియల్స్ లో ప్రస్తుతం కన్నడ భామలకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మధు రెడ్డి. ఒక్క సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా తెలుగు నటీమణులకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు అని.. తెలుగమ్మాయిలకు అన్యాయం జరుగుతోందని కూడా ఆమె బాధపడుతోంది. ఇటీవల మధు రెడ్డి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయగా దానికి 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.
అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. నాకు నచ్చిన పాత్రలు రావడం లేదు .. నేను గుర్తుండిపోయే రోల్స్ మాత్రమే చేయాలని అనుకుంటున్నాను.. చిన్నచిన్న రోల్స్ చేసి ఉంటే ఇప్పుడు బిజీగా ఉండే దాన్ని.. ముఖ్యంగా బెంగళూరు వాళ్లకే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు.. అందరూ వాళ్లే అయితే ఇక తెలుగు వాళ్ళు ఏం చేయాలి అంటూ ఆమె ప్రశ్నించారు.  ముఖ్యంగా మనకు మనం సపోర్టు ,రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా అని కూడా మధు రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా కన్నడ వాళ్ళు రాజ్యం ఏలుతుంటే ఇక్కడ మేమేం చేయాలి అంటూ ఆమె బాధపడుతున్నారు. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు నటీమణులకు జరుగుతున్న అన్యాయాలకు గళం విప్పి హాట్ టాపిక్ గా మారారు మధు రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: