టాప్ ప్లేసు కోసం టీవీ9, ఎన్టీవీ ఫైటింగ్?
హైదరాబాద్ లో టీవీ 9 నెంబర్ వన్ గా ఉండేది. కానీ టీవీ 9 ను దాటి ఎన్టీవీ మొదటి స్థానానికి వచ్చేసింది. ఎన్టీవీ ప్రస్తుతం హైదరాబాద్ లో ని 91 శాతం రేటింగ్ పెరిగితే టీవీ 9 మాత్రం 81 మధ్య రేటింగ్ నడుస్తోంది. 16 వ వారం నుంచి 24 వారాల దాకా కూడా ఎన్టీవీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
కానీ కేవలం రెండు వారాలు మాత్రమే టీవీ 9 తన మొదటి స్థానాన్ని నిలుపుకుంది. ఇప్పుడు ఎన్టీవీ మొదటి స్థానానికి వచ్చే సరికి టీవీ 9 వారిపై విమర్శలు చేస్తుంది. ఇది కేవలం అబద్ధపు ప్రచారం అని కేవలం టీవీ 9 ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారే ఎంతో ఎక్కువ మంది ఉంటారని చెప్పింది. టీవీ 9 కంటే ఎక్కడ కూడా ఎన్టీవీ ముందంజ లో లేదని ఆరోపించింది. అయితే ఈ మధ్య టీవీ 9, ఎన్టీవీల మధ్యే కాకుండా ఆ రిపోర్టర్ల మధ్య కూడా కొట్టుకునే వరకు వెళ్లడం జరిగింది.
ఎన్టీవీ రెహనా, టీవీ9 హసీనా ఇద్దరు బెజవాడలో కొట్టుకోవడం అది కూడా సెక్రటెరియేట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కవరేజీలో జరగడం సంచలనంగా మారింది. వీరు కొట్టుకున్న అంశం స్వయంగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల విషయం బహిర్గతమైంది. దీని వల్ల టీవీ9, ఎన్టీవీ మొదటి స్థానం కోసం ఎలా కొట్టుకుంటున్నాయోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.