టీవీ: ఈ జంటకు పెళ్లి అవసరమా.. నెటిజన్స్ ట్రోల్స్ వైరల్!
ఇక అసలు విషయంలోకి వెళితే విష్ణుకాంత్ , సంయుత జోడికి కోలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సిప్పుకుల్ ముత్తు అనే టీవీ షో ద్వారా వీళ్ళిద్దరూ మరింత దగ్గరయ్యారు. దాదాపు 7 నెలల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2023వ సంవత్సరం మార్చి మూడవ తేదీన పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన 15 రోజులకే విడిపోతున్నామని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈ జంటపై సూపర్ సింగర్ కంటెస్టెంట్ రాజ్యలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్తలు కాస్త తెరపైకి వచ్చాయి.
గతంలో ఎంతో ప్రేమను వొలకబోసిన ఈ జంట విడిపోవాలని అనుకున్నప్పుడు ఒకరినొకరు తిట్టుకొని దూషించుకున్నారు అంటూ రాజ్యలక్ష్మి వెల్లడించింది.. ఇక సంయుత మాట్లాడుతూ.. తన మాజీ భర్త చెత్త వీడియోలను చూపించేవాడని.. శారీరక బంధం పై మాత్రమే అతడికి ఆసక్తి ఉందని.. కేవలం బెడ్రూమ్ సుఖం మాత్రమే కోరుకుంటాడని.. అందుకోసం కెమెరాలు కూడా పెట్టాడు అని ఆమె చెప్పుకొచ్చింది. ఒకవైపు విష్ణుకాంత మాట్లాడుతూ.. తన భార్యకు ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేశాడు. అలా వీళ్ళిద్దరూ పెళ్లి అయిన 15 రోజులకి దూరం కావాల్సి వచ్చింది. ఇది తెలిసిన నెటిజన్స్ అందరూ ఈ జంటకు పెళ్లి అవసరమా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.ఇక రాజ్యలక్ష్మి విషయానికి వస్తే.. పుష్ప ది రైస్ సినిమాలోని సామి సామి పాట పాడి తమిళ వెర్షన్ లో పాడి మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.