టీవీ: బిగ్ బాస్ లోకి భర్తతో రానున్న ఉదయ భాను..!

Divya
బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ రియాల్టీ షో ఇప్పుడు ఆరు సీజన్ లని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మరొకవైపు ఇతర భాషల్లో కూడా ఈ షో విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా హిందీలో అయితే 16 సీజన్లను పూర్తిచేసుకుంది. ఇక తెలుగులో కూడా ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్ కి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సీజన్ మొదలయ్యే రెండు మూడు నెలల ముందు కంటెస్టెంట్లు ఎంపిక జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు పలు వురు  కంటెస్టెంట్ లను  కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా టీవీ యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఉదయభాను యాంకర్ గా ఎన్నో షోలను ముందుకు నడిపింది.
అంతేకాదు సినిమాలలో కూడా నటించి అటు వెండితెరకు ఇటు బుల్లితెరకు పరిచయమైన ఈమె ఇప్పుడు తన భర్తతో కలిసి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పార్టిసిపెంట్ చేయబోతుందని సమాచారం . వాస్తవానికి గతంలో కూడా ఉదయభాను కి  బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది . కాకపోతే ఆమె పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కావడంతో వారి ఆలనా పాలనా చూసుకోవడం కోసం షో కూడా ఆపివేసింది.  కానీ ఈసారి పిల్లలు పెద్దవాళ్ళు కావడం, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటుండడంతో ఇప్పుడు భర్తతో రావడానికి ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఉదయభాను తన భర్తతో కలిసి కపుల్ క్యాటగిరి లో ఎంట్రీ ఇస్తుందా?  లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఉదయభాను ఇప్పుడు బిగ్బాస్ హౌస్ లోకి వస్తున్నారా లేదా అన్న ప్రశ్న అభిమానులలో మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: