టీవీ: దానికోసమే అంటూ వ్యభిచార ఘటనపై ఓపెన్ అయిన యమున..!

Divya
బుల్లితెర నటిగా ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను  సొంతం చేసుకున్న నటి యమునా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న అన్ని సీరియల్స్ లో కూడా దాదాపు ఈమె కోసం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ను దర్శకులు డిజైన్ చేస్తున్నారు అంటే ఈమెకు బుల్లితెర ప్రేక్షకులలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.  తన నటనతో,  అందంతో , చలాకీతనంతో ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. కేవలం బుల్లితెర పైనే కాదు గతంలో వెండితెరపై కూడా హీరోయిన్గా మెరిసిన ఈ అందాల ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
దాదాపు ఎన్నో రోజుల తర్వాత సీనియర్ నటి యమునా తనపై వచ్చిన వ్యభిచార పుకార్లపై ఓపెన్ అవుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. యమునా మాట్లాడుతూ.. సూటిపోటి మాటలు భరించలేక కొంతకాలం నుంచి నేను మీడియాకే కాదు సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటున్నాను.  ఇన్నాళ్లు మౌనాన్ని బ్రేక్ చేస్తూ ఈరోజు నేను పడ్డ కష్టాలను అవమానాలను ఇబ్బందులను చెప్పుకుంటున్నాను అంటూ వెల్లడించింది..యమునా మాట్లాడుతూ.. నిజంగా నేను ఏ రోజు ఎలాంటి తప్పు చేయలేదు.. కావాలని నన్ను ఇరికించారు.. నేను ఆరోజు ఆ హోటల్ కి వెళ్ళలేదు కానీ వ్యభిచారి అని నిందపడ్డాక నాకు బ్రతకాలని కూడా అనిపించలేదు.  పిల్లలకి చెడ్డ పేరు రాకుండా ఆస్తుల వీలునామా రాసి జీవితం చాలించాలని అనుకున్నాను..
కానీ ఒక స్నేహితురాలు నా బ్రెయిన్ వాష్ చేయడంతో పిల్లల కోసమే మనోధైర్యాన్ని నింపుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నాను . కాలక్రమేనా ఎదుటివారి మాటలు పట్టించుకోవడం కూడా మానేశాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.  జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది అంటూ యమునా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని.. తాను పడ్డ అవమానాలకు తాను కృంగిపోవడం లేదు అని తాను ఎటువంటి తప్పు చేయడం లేదు అని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: