టీవీ: యాంకర్ రవి కెరియర్ ముగిసినట్టేనా..?

Divya
ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ప్రదీప్ తో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్లలో రవి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇద్దరు కూడా పోటీపడి మరి కార్యక్రమాలను చేస్తూ ఉండేవారు. కెరియర్ ప్రారంభంలో యాంకర్ రవి లాస్యతో కలిసి ఎక్కువ కార్యక్రమాలు చేసేవారు. అలా రవి, లాస్య అంటే మంచి గుర్తింపు లభించింది. ఆ సమయంలో ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ వీరికి అప్పటికే వేరు వేరు వివాహాలు అవ్వడం కూడా జరిగాయి.

దీంతో వీరిపై వస్తున్న వార్తలకి పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఇక అలాంటి సమయంలోనే యాంకర్ రవి తన భార్యను మరియు బిడ్డను కూడా పరిచయం చేయడం జరిగింది. భార్య బిడ్డతో కూడా బుల్లితెరపై చాలా రోజులు సందడి చేశారు.రవి కామెడీ డబుల్ మీనింగ్ డైలాగులతో ఎదుటివారిని తక్కువ చేసి యాంకర్ రవి మాట్లాడుతూ ఉన్నందువల్ల అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అందుకే ఆయనకు కార్యక్రమాలు అంటే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ కారణం వల్లనే ఎన్నో ప్రోగ్రాములు రవితో చేయాలనుకున్న ప్రొడ్యూసర్స్ మరొక యాంకర్ తో చేస్తున్నట్లు బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా స్టార్ మా మరియు ఈటీవీ కార్యక్రమాలకు యాంకర్ రవి పెద్దగా కనిపించడం లేదు. బుల్లితెర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రదీప్ తో పోలిస్తే యాంకర్ రవి అత్యంత దారుణమైన కెరీర్ ని అనుభవిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో కూడా యాంకర్ రవితో పోలిస్తే ప్రదీప్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటున్నారని సమాచారం. అయితే అభిమానులు మాత్రం రవి యాంకర్ గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇక పలు చిత్రాలలో నటించిన రవి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మరి అభిమానుల కోరిక మేరకు యాంకర్ గా తిరిగి వస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: