టీవీ: జబర్దస్త్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన టీమ్ లిడర్..!!

Divya
బుల్లితెరపై ప్రయాసమయ్యేటువంటి ఎన్నో షోలు ఉన్నప్పటికీ జబర్దస్త్ షో కి మాత్రం ఒక సపరేటు స్టైల్ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో పాల్గొనే కమెడియన్లు సైతం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. దాదాపుగా ఈ షో మొదలై ఇప్పటికీ 10 సంవత్సరాలు పైనే అవుతున్న గడిచిన రెండు సంవత్సరాల క్రితం వరకు టాప్ రేటింగ్ లో ఉండేది. ఈమధ్య జబర్దస్త్ లో పలువురు కమెడియన్లు సైతం ఈ షోను వదిలి వెళ్లడంతో టిఆర్పి రేటింగ్ విషయంలో చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు.

తాజాగా జబర్దస్త్ కమెడియన్ టీం లీడర్ ,నటుడు ,అదిరే అభి తన వాట్సాప్ స్టేటస్ లో ఒక ఫోటోని షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతోంది. అదిరే అభి తాను ఎదగడంతో పాటు తన టీం లో ఎంతో మందికి అవకాశాన్ని కల్పించారని చెప్పవచ్చు. జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేసే కమెడియన్లు సైతం అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండే వారిని తెలుపుతున్నారు. అలాంటి ఫ్యామిలీకి ఏదో దిష్టి తగిలిందని.. మాలో మేమే తిట్టుకుంటున్నామని కామెంట్లను చేయడం జరిగింది.

అభి తన పోస్టులో ఇలా రాసు కుంటూ.. మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది.. ఎప్పుడు నవ్వే జడ్జిలు టైమింగ్ తో పంచులు వేసి టీం లీడర్స్ కామెడీని అవలీలగా పండించగలిగే కంటిస్టెంట్లు అమ్మలాంటి మల్లెమాల ఇది మా కుటుంబం.. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.. స్టూడియో దాటే నవ్వులు.. జడ్జిల చిలిపితనం యాంకర్ల మాయాజాలం స్కిట్ ఎక్కే వరకు రిహాసర్లు ఇలా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు చాలానే ఉండేదని తెలుపుకొచ్చారు. కానీ ఇవేవీ ఇప్పుడు కనిపించడం లేదని తన పోస్టులు రాసుకొచ్చారు అభి. మళ్లీ సమయం వెనక్కి వెళితే బాగుంటుంది అంటూ అభి రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: