టీవీ: అందర్నీ నవ్వించి జబర్దస్త్ శాంతికు ఇన్ని కష్టాలా..!!

Divya
తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు బాగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా ఎంతోమంది కి జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో లేడీ గెటప్పులు మాత్రమే కాకుండా ఏకంగా లేడీస్ తోనే స్కిట్లు చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదివరకు లేడీస్ కి బదులుగా లేఢీ గెటప్స్ ఎక్కువగా కనిపించేవి. అయితే జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ని పరిచయం చేసింది మాత్రం చమ్మక్ చంద్ర ఇక అప్పటినుంచి జబర్దస్త్ లో లేడీ గెటప్ హవా బాగా కొనసాగుతూ వచ్చింది.

అలా జబర్దస్త్ లో శాంతి స్వరూప్,సాయి లీల, హరిత, ప్రియాంక తదితరులు లేడీ గెటప్స్ లో కనిపించేవారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా సుమ హోస్టుగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కి జబర్దస్త్ లో ఉండే లేడీ గెటప్స్ వేసేవారిలో కొంతమంది ఈ షోకి హాజరు కావడం జరిగింది. కమెడియన్ లు వారి యొక్క తల్లిదండ్రులతో ఈ షోలోకి హాజరయ్యారు. శాంతి స్వరూప్, మోహన్ ,హరిత ,సాయిలేఖ తండ్రులతో రావడం జరిగేది.

మిగిలిన వారు మాత్రం తండ్రులతో రాగా శాంతి స్వరూప్ మాత్రం తన తల్లితో క్యాష్ ప్రోగ్రామ్ కి  రావడం జరిగింది ఈ నేపథ్యంలో తన తల్లి పడ్డ కష్టాలను కూడా తెలియజేస్తూ ఎమోషనల్ అయింది శాంతి స్వరూప్. తన తల్లి గురించి మాట్లాడుతూ.. తల్లితో కలిసి స్టేజ్ పైన కన్నీళ్లు పెట్టుకుంది. శాంతి స్వరూప్ మాట్లాడుతూ తన తల్లి చాలా ఇళ్లల్లో పనిచేసేదని అప్పుడు ఆకలి విలువ అంటే ఏంటో మాకు తెలిసి వచ్చింది అంటూ చాలా ఎమోషనల్ అవుతూ తెలియజేసింది. ఇక అంతే కాకుండా శాంతి స్వరూప్ తల్లికి చిన్న వయసు నుంచి గొంతు సరిగా రాదని స్పష్టంగా మాట్లాడరని ఎంత ప్రయత్నించినా మాట్లాడలేకపోతుంటుందని తెలియజేసింది. శాంతి స్వరూప్ తల్లి పేరు సరోజమ్మ.. ఇక ఈమె మాట్లాడుతూ కూడా చాలా ఎమోషనల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: