"వీక్.. వీక్.. వీక్" అనుకున్న వాళ్ళే స్ట్రాంగ్ గా మారుతున్నారు !

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 మొత్తం 21 మంది సభ్యులతో మొదలయింది. కాగా ప్రస్తుతం ఆ సంఖ్య కాస్త 14 కు చేరుకుంది. గడిచిన ఈ ఏడు వారాలలో సరిగా ఆడని సభ్యులు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. అలా ఎలిమినేటి అయిన వారిలో షానీ, అభినయశ్రీ, నేహా, ఆరోహి, పింకీ, చంటి మరియు అర్జున్ కళ్యాణ్ లు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆడిన ఆటను చూసిన ప్రేక్షకులకు ఒక్కొక్కరి గురించి ఒక్కో అభిప్రాయం ఉంది. కానీ కొన్ని అభిప్రాయాలను మాత్రం ఏకంగా ఇంటి సభ్యులే పదే పదే అంటూ బలవంతంగా ప్రేక్షకుల మనసులోకి వెళ్లేలా చేస్తున్నారు. ఉదాహరణకు ఇంట్లోకి భార్యాభర్తలుగా వచ్చిన రోహిత్ మరియు మెరీనాలు మొదట కొన్ని రోజులు జంటగానే ఆటను కొనసాగించారు.
కానీ ఆ తర్వాత బిగ్ బాస్ ఆదేశం మేరకు ఒంటిరిగా విడివిడిగా ఆడడం స్టార్ట్ చేశారు. కానీ మొదటి వారం నుండి కూడా వీరిద్దరినీ వీక్.. వీక్..వీక్ అంటూ హౌస్ లో ఉన్న సభ్యులు అందరూ నామినేట్ చేస్తూ వచ్చారు. అయితే నామినేట్ అయిన ప్రతిసారీ సేఫ్ అవుతూ వచ్చి తాము వీక్ కాదని నిరూపించారు. కాగా ప్రస్తుతం ఎనిమిదవ వారం జరుగుతోంది, గత వారం నుండి రోహిత్ మరియు మెరీనాలు ఇద్దరూ కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతి టాస్క్ లోనూ శక్తికి మించి కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆర్గ్యుమెంట్ చేసే సమయంలోనూ తమ ఆవేశంతో కాకుండా ఆలోచనతో సరైన పాయింట్ లను ముందు పెడుతూ మాట్లాడుతున్న తీరు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
భార్యాభర్తలుగా వచ్చిన వీరిద్దరూ ఒక మంచి ఆటగాళ్లుగా మరియు మంచి మనుషులుగా మారారు అని చెప్పారు. వీరు ఇలాగే ఆడితే టాప్ 5 లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. మరి ముందు ముందు హౌస్ లో ఉన్న సభ్యుల జాతకాలు ఏ విధంగా మారనున్నాయి అన్నది చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: