టీవీ: కమెడియన్ ఆలీ బుల్లితెరపై నెల సంపాదన తెలిస్తే షాక్..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు సంపాదించారు కమెడియన్ ఆలీ. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ ఎంట్రి ఇచ్చినప్పటికీ పలు సినిమాలలో బుల్లితెరపై కనిపిస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆలీతో సరదాగానే కార్యక్రమానికీ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు ఆలీ. అయితే ఆలీకి వెండితెర పైన పలు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తూ ఉంటారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు.. ఆలీకి చాలా ఇష్టము. ఆ నటుడు కూడా బుల్లితెరపై కార్యక్రమాలను చేస్తూ ఉండడంతో ఆ నటుడిని  చూసి అలీ కూడా బుల్లితెరపై కార్యక్రమాలు చేస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా అలీ ఎంతమంది సెలబ్రిటీలను సైతం ఆహ్వానించి వారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి కూడా ఎంతో ప్రేక్షక ఆదరణ లభిస్తోంది అని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిన ఆలీ బుల్లితెర కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. అలా భారీగానే రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోని ఆలీ తో సరదాగా కార్యక్రమానికి యాంకర్ గా ఉన్న ఆలీ ఒక్కో ఎపిసోడ్ కి రూ.6 లక్షల రూపాయలు తీసుకోబోతున్నట్లు సమాచారం. అంటే దాదాపుగా నెలకి రూ.25 లక్షలు పైగా సంపాదిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆలీ నటించిన సినిమాల విషయానికి వస్తే.. లైగర్,f-3, తదితర సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా బుల్లితెరపై అవార్డు ఈవెంట్స్ ఉన్నాయంటే చాలు కచ్చితంగా ఆ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వాటికి ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అలీ రెమ్యూనరేషన్ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: