టీవీ: మనసంతా నువ్వే సీరియల్ దమయంతి రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ఈ మధ్యకాలంలో ఆడవారు.. మగవారు ఇద్దరూ కూడా సీరియల్స్ కి బాగా అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఉత్కంఠభరితమైన కథ తో సాగే ఈ సీరియల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సీరియల్స్ లో నటించే నటీనటులు కూడా అందచందాలతో పాటు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఎమోషనల్గా కూడా బాగా ప్రేక్షకులలో ఇంటరాక్ట్ అవుతున్నారు. అందుకే సీరియల్స్ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఇటీవల మంచి కథతో దూసుకుపోతున్న సీరియల్ మనసంతా నువ్వే. ఇక ప్రతిరోజూ ఈ టీవీ ఛానల్ లో 8:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ కి మంచి టిఆర్పి రేటింగ్ కూడా దక్కుతుంది.
ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న దమయంతి రియల్ లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. దమయంతి అసలు పేరు నవీన. ఈమె జూన్ 8వ తేదీన చీరాలలో జన్మించింది. ఇక ఈమెకు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. ఇక ఈమె పుట్టింది చీరాలలో అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా తల్లితో పాటు వీరు కూడా హైదరాబాద్ కి  షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఇక నవీన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్లోనే పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండడంతో చదువు పూర్తయిన వెంటనే నటనలో శిక్షణ తీసుకోవాలని అనుకుంది నవీనా.

ఇక ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్న ఈమెకు నేరుగా నటించే అవకాశం రాలేదు. కానీ చివరికి శివరాం బాలాజీ అనే డైరెక్టర్ కు ఈమె ఫోటోలు బాగా నచ్చి ఆడిషన్స్ కి  పిలిచారు. అలా మొదటిసారి తెలుగు సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు.ఇక  వీరి వీరి గుమ్మడి పండు,  అవునంటే కాదనిలే అనే తెలుగు సినిమాలో నవీన నటించింది. ఇక సినిమాలలోనే కాకుండా బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారి జీ తెలుగు లో ప్రసారమైన కలవారి కోడలు అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై అరంగేట్రం చేసింది నవీన. మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నవీన ఆ తరువాత పెళ్లినాటి ప్రమాణాలు, అలౌకిక, అగ్నిగుండం , చంద్రముఖి సీరియల్ లో నటించింది. ఇక ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారం అవుతున్న మనసంతా నువ్వే సీరియల్ లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది నవీన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: