టీవీ: జబర్దస్త్ షో కి కష్టకాలం రానుందా.. కారణం..?

Divya
ప్రముఖ దిగ్గజ కామెడీ షో లో జబర్దస్త్ షో ఒకటీ. ఈటీవీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఎన్నో సంవత్సరాల నుండి టాప్ రేసింగ్ షో గా కొనసాగుతోంది. క్లాస్, మాస్, ధనిక పేద అనే తేడా లేకుండా జబర్దస్త్ షో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో జబర్దస్త్ చూసే ప్రేక్షకుల సంఖ్య కొన్ని కోట్ల సంఖ్యకు చేరింది. జబర్దస్త్ సక్సెస్ కావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ సౌండ్ కూడా ప్రారంభించారు. ఇక ఒకదానిలో అనసూయ, మరొక వాటిలో రష్మీ యాంకర్ గా చేస్తున్నారు.
దీంతో వీరిద్దరు ఎక్కడాలేని ఫేమ్ రాబట్టి బుల్లితెర స్టార్స్ గా మారిపోయారు. ఇక గతంలో నటుడు నాగబాబు రోజా జడ్జ్ గా ఉండేవారు. ఇక వీరిద్దరూ ఉన్నప్పుడు ఈ కామెడీ షో ఎంతో గొప్పగా సాగుతూ ఉండేది. అయితే ఇందులో కొంత మంది కమెడియన్ల గా బాగా ఆకట్టుకోవడంతో వారికి సినిమా అవకాశాలు కూడా రావడం జరిగింది ఇక దాంతో అటు వైపుగా వెళ్లారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర, సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, రాకెట్ రాఘవ, చంటి వంటి వారు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.
ఇక జబర్దస్త్ మేకర్స్ తో గొడవ పడి నాగబాబు 2019లో ఈ షో ని విడిచి వెళ్లారు. ఆయన వెళ్తూ వెళ్తూ జబర్దస్త్ లో ఉండే చమ్మక్ చంద్ర, ఆర్పి వంటి కమెడియన్ల ను పట్టుకు వెళ్ళాడు. కానీ రోజా తన స్థానంలో అలాగే కొనసాగడం జరిగింది. నాగబాబు ప్లేస్ లో సింగర్ మనో వచ్చారు. ఇక రోజా మనో కాంబినేషన్ కూడా బాగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కానీ ఇటీవల కాలంలో మంత్రిగా ప్రమోషన్ అందుకున్న రోజా జబర్దస్త్ వీడింది. దీంతో ఈ షోకు పెద్ద దెబ్బ పడిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా జబర్దస్త్ కి మంచి కమెడియన్ గా ఉన్న హైపర్ ఆది కూడా బయటకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సుడిగాలి సుధీర్ గెటప్ శీను, తదితరులు వంటివారు కూడా సినిమాలో నటించడంతో ఇక ఈ షో నడవడం కష్టం అని ఇండస్ట్రీలో టాప్ గా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: