టీవీ: జయమ్మ పంచాయతీతో ఆ డైరెక్టర్ దృష్టిలో సుమ పడినట్లేనా..!!

Divya
ఎన్ని రోజుల పాటు యాంకర్ గాఅదరగొట్టిన సుమ తమ కెరీర్ లో మొదటి సారిగా ఒక ఫీమేల్ మూవీలో నటిస్తున్నది. ఇక ఆ చిత్రమే జయమ్మ పంచాయితీ. ఇక ఈ సినిమా చేయడం ఒక సాహసమే అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా సుమ ఈ సినిమా పైన చాలా నమ్మకం పెట్టుకున్న ది. టీవీ షో లే కాకుండా స్టార్స్ సినిమా నుండి యంగ్ హీరో వరకు.. సుమ లేకుండా ఏ ఈవెంట్ జరగదు. ఇక మరికొందరు అయితే సుమ రావడం తమకు లక్ గా భావిస్తూ ఉంటారు.

అయితే ఇలా యాంకర్గా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న సుమ తిరిగి మళ్ళీ సినిమాల్లోకి నటించడానికి సిద్ధమైంది. అయితే జయమ్మ సినిమా పంచాయతీ కంటెంట్ తనకు బాగా నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నానని తెలియజేసింది. అయితే యాంకర్ సుమ ను సీరియస్ యాంగిల్ లో చూసి డైరెక్టర్ త్రివిక్రమ్ తన సినిమాలలో ఒక పవర్ఫుల్ పాత్ర రాసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా పాత హీరోయిన్ లకు సైతం తన సినిమాలలో కొన్ని పాత్రలను పెట్టి వారిని బాగా పాపులర్ చేశారు డైరెక్టర్ త్రివిక్రమ్.
ఇక ఇప్పుడు కూడా సుమకి ఇలా ఏదైనా ఒక స్టార్ హీరో సినిమాలో స్ట్రాంగ్ పాత్ర ఇచ్చి తనను కూడా హైలెట్గా చేస్తారని ఆమె అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇక సుమ కూడా పలు స్టార్ హీరోల సినిమాలలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు గా సమాచారం. మరి రాబోయే రోజులలో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.ఏది ఏమైనా యాంకర్ సుమ ప్రస్తుతం తన హవాని కొనసాగిస్తూ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జయమ్మ పంచాయతీ చిత్రం సక్సెస్ కావాలని మనం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: