
టీవీ: జాతి రత్నాలు కోసం శ్రీముఖి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..!!
జాతి రత్నాలు షో కోసం శ్రీముఖి, అనసూయ తరహా లోనే అత్యధిక పారితోషికం అందుకుంటోంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ షో కేవలం షెడ్యూల్ ప్రకారమే ఉంటుందట. అందుచేతనే శ్రీముఖి రెమ్యూనరేషన్ కూడా.. మొదటి షెడ్యూల్ కి 6 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకు న్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఒక్కో షో కి అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకునేది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై అవకాశాలు లేకుండా పోవడంతో తన రెమ్యూనరేషన్ కూడా బాగా తగ్గించింది అన్నట్టుగా వార్త లు వినిపిస్తున్నాయి.
అయితే శ్రీముఖి గతంలో బుల్లితెర మీద కంటే వెండితెర మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అందుచేతనే ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ పై ఎక్కువ ఫోకస్ చేయలేకపోయింది. అయితే మల్లె మాల సంస్థవారు శ్రీముఖి ని జాతిరత్నాలు షోకి తీసుకోవడానికి గల ముఖ్య కారణం గతంలో కూడా మల్లెమాల వారితో ఈమెకు బాగా సన్నిహితంగా ఉండడం చేత ఈమె రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చినప్పటికీ ఈ కార్యక్రమానికి యాంకర్గా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో శ్రీముఖి అత్యధికంగా రెమ్యూనరేషన్ అందు కుంటుంది ఏమో చూడా లి మరి.