టీవీ: ఈ బుల్లితెర కమెడియన్ ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
బుల్లితెరపై ప్రసారమౌతున్న కామెడీ షో లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కమెడియన్ కిరాక్ ఆర్ పీ.. తనదైన పంచులతో జడ్జ్ లను నవ్విస్తూ, ప్రేక్షకులను కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు ఈ కమెడియన్. ఇక తను చేసే ప్రతి ఒక్క స్కిట్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టి అందులో తన అందమైన ఇంటిని కూడా చూపించడం జరిగింది.  వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఇక తన యూట్యూబ్ ఛానల్ లో మొదటి సారిగా హోమ్ టూర్  వీడియోను కూడా చేశారు కిరాక్ ఆర్పి.. ఇక ఆ వీడియో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియో లోకి వస్తే..ఆర్.పీ. ఇల్లు ఎంతో విశాలంగా లగ్జరీ గా ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తన ఇంటిలో.. హాలులో అడుగుపెట్టగానే ఎంతో విశాలమైన సోఫా తో పాటు ఒక పెద్ద స్మార్ట్ టీవీ కూడా ఉన్నది. ఇక అంతే కాకుండా తనకు వచ్చిన కొన్ని బహుమతులను కూడా అక్కడే ఉంచారు కిరాక్ ఆర్. పీ.
ఇక తన హాలులోనే పక్కన ఒక ఆక్వేరియం తో పాటు మనీ ప్లాంట్ చెట్టు ను కూడా ఉంచారు. ఇక కిచెన్ సంబంధిత వాటిని కూడా ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేయించారు ఆర్ పి. ఇక ఈ ఇంటిని రెండు అంతస్తుల మేరకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇక వాటికి లిఫ్ట్ సదుపాయాన్ని కూడా అమర్చుకున్నాడు ఆర్ పి. ఇక తన తల్లిదండ్రుల కోసం ఒక బెడ్ రూములు కూడా ఏర్పరుచుకున్నాడు. మొదటి ఫ్లోర్ లోనే ఆర్పి తన స్టడీ మెటీరియల్ ని, తన సోదరుడి బెడ్ రూమ్, తన మాస్టర్ బెడ్ రూమ్ లను చూపించడం జరిగింది. ఇక వీటన్నిటినీ తానే దగ్గరుండి వారి ఆలోచనలకు తగ్గట్టుగా డిజైన్ చేశామని తెలిపారు. ఇక అంతే కాకుండా తన బెడ్ రూం లో ఒక అమ్మాయి ఫోటో చూపిస్తూ ఈమె తన కాబోయే భార్య అని తెలియజేశారు. ఇక అలాగే హోమ్ థియేటర్ ని కూడా చూపించారు. ఇక టెర్రస్ లో తన పెంచుకున్న కొన్ని వివిధ రకాల మొక్కలను కూడా చూపించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: