టీవీ: ఆరియానా నడుము పై నాగార్జున కామెంట్స్ వైరల్..!!

Divya
బిగ్ బాస్ షో ప్రస్తుతం నాన్ స్టాప్ గా, ఫన్నీగా కొనసాగుతోంది.. ఇక ఇలాంటి క్రమంలోనే కంటెస్టెంట్ లు అందరూ ఎక్కువగా నవ్వించడానికి కష్టపడుతూ ఉండడంతో పాటు నాగార్జున కూడా హోస్ట్ గా వచ్చారు. ఇక నాగార్జున రావడంతో కంటెస్టెంట్ లందరికీ టాస్క్ లు అందించడం జరిగింది. ఇక ఇందులో మొదటిగా ఎలిమినేషన్ భాగంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ముమైత్ ఖాన్ బదులుగా తాను వెళ్ళిపోతాను అనే భ్రమలో ఉండేది సరయు.. దీంతో ఆమె బోరున ఏడ్చేసింది.

కానీ తన సేఫ్ అని తెలిసినప్పటికీ కూడా ఆ విషయాన్ని తను షేర్ చేసింది.. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇందులో చాలెంజర్స్ వారియర్స్ మధ్య డాన్స్ పోటీలు జరిగాయి. ఇందులో వారియర్, చాలెంజర్స్ నుంచి  ఒక్కొక్క కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేసుకొని అందులో ఒకరు డాన్స్ చేయవలసి ఉంటుందని ఆదేశించాడు బిగ్ బాస్. అలా యాంకర్ శివ-తేజస్వి, అఖిల్- బిందుమాధవి, ఆరియానా -చైతు, స్రవంతి-ఆషు రెడ్డి ఇలా ఒక్కొక్క జోడి తన డాన్సులతో ఇరగదీశారు అని చెప్పవచ్చు. అయితే ఇంత మందిలో R.J. చైతు-ఆరియానా డాన్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వారి డాన్స్ మీద నాగార్జున కూడా మార్కులు ఇవ్వడం జరిగింది.


అదేవిధంగా చైతు వేసిన కౌంటర్ కూడా అదిరిపోయింది అని చెప్పవచ్చు.. దీంతో ఆరియానా కు మాత్రం 9 మార్కులు ఇవ్వగా చైతు కి 8 మార్కులు ఇవ్వడం జరిగింది దీనితో చైతు కౌంటర్ వేశారు.. ఆరియానా డాన్స్ కు మార్కులు వేశారా.. లేక నడుముకు వేసారా అని అడగగా.. కరెక్ట్ గా చెప్పావ్ ఆరియానా నడుము కి వేసా అన్నట్లుగా నాగార్జున సెటైర్ వేశారు. ఇక శివ-తేజస్వి తో డాన్స్ వేయడానికి చాలా కష్టపడ్డాడు.. కానీ తేజస్వి మాత్రం మాస్ స్టెప్పులతో దుమ్ముదులిపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: