బిగ్ బాస్ 6 ఓటిటి కి పరిమితం కావడం వెనుకున్న వాస్తవం ఇదే?

VAMSI
బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో ఎంటర్టైన్మెంట్ ను పంచే షో లు వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కానీ మొట్ట మొదటి సారిగా బుల్లితెర చరిత్రలో వచ్చిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ ఒక్కటే అని చెప్పాలి. ఈ షో నాలుగు భాషల్లోనూ ఉంది. కాగా ఇప్పటి వరకు తెలుగులో 5 సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని ఆరవ సీజన్ లోకి ఈ రోజు అడుగు పెట్టింది. అయితే ఈ సారి ఎప్పటిలాగా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించిన బిగ్ బాస్ యాజమాన్యం ఓటిటి ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసింది. గత సీజన్ లాగే ఇందులో కూడా 18 మంది పోటీ దారులు ఉండడం గమనార్హం.

అయితే ఇప్పటి వరకు జరిగిన 5 సీజన్ లలో మనము చూసింది అంతా ఒక ఎత్తు.. ఇప్పుడు ఈ సీజన్ లో జరగబోయేది ఒక ఎత్తు అని తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒకటి మాత్రం మనసులో బలంగా నాటుకుపోయింది. బిగ్ బాస్ అంటే కేవలం రొమాన్స్, గొడవలు, అసభ్యకర మాటలు. దీనికి తగ్గట్లే అన్ని సీజన్ లలోనూ కుటుంబాలు చూడలేని విధంగా ఎపిసోడ్ లను చిత్రీకరించి ఇబ్బంది పెడుతున్నారు. ఈ బిగ్ బాస్ షో పై గతంలో చాలా వివాదాలు జరిగాయి, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోని బిగ్ బాస్ యాజమాన్యం తగ్గేదేలే అంటూ మరో సీజన్ ను హాట్ స్టార్ ఓటిటి వేదిక ద్వారా మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా మన ముందుకు వచ్చేశారు.

అయితే ఈ సారి ఓటిటి లో ప్రసారం అవుతుంది కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం తక్కువే. అందులోనే కుటుంబ ప్రేక్షకులు చూసేది తక్కువ. కాబట్టి ఈ సారి టీవీ ఫార్మాట్ నుండి ఓటిటీ ఫార్మాట్ కు మార్చినట్లు తెలుస్తోంది. లేదంటే టీవీ లోనే ప్రసారం చేసేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: