టీవీ:రెచ్చిపోయిన రోజా.. చేతులెత్తేసిన సుధీర్..!!

Divya
బుల్లితెరపై జబర్దస్త్ షో కు, అందులో ఉండే యాంకర్లకు, జడ్జిలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వుంది.. ఇక అందుకే వీరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరందరూ ఒకరిమీద ఒకరు వేసుకునే పంచులతో ప్రేక్షకులు ఎంతో కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. ఇక ఇందులో ముఖ్యంగా రోజా అందరికంటే ముందుగా వారు వేయాలనుకొనే పంచులను ఆమె తెలియజేస్తూ ఉంటుంది. అలా రోజా దెబ్బకు ఎక్కువగా బలవుతున్న టీమ్ ఏదంటే సుడిగాలి సుధీర్ టీమ్ అని చెప్పవచ్చు. ఆటో రాంప్రసాద్ వేసే ఆటో పంచులను , సుడిగాలి సుదీర్ వేసి సిల్లీ పంచ్ లను ముందే కనిపెట్టి రోజా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నవ్వులు-పువ్వులు పూయిస్తూ ఉంటుంది.

జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదలవ్వగా ఇందులో వరుసపెట్టి రోజా వేసే పంచులకు ఆటో రాంప్రసాద్ కు సుడిగాలి సుదీర్ కు స్కిట్ లో మాటలు లేకుండా పోయాయి. ఇకపోతే ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ పంచ్ లను  రోజా ముందే కనిపెట్టి వరుసపెట్టి పంచ్ లు  విసరడంతో దీంతో చెప్పేది ఏమీ లేక సుధీర్ తల పట్టుకుంటాడు. అన్నిటికంటే ఎక్కువగా సుధీర్ వేయాలనుకుంటే ఆ పంచ్ లను రోజా ఫటఫటా వేస్తూ ఉంటే సుదీప్ తెల్లముఖం వేసుకున్నాడు. ముఖ్యంగా హీరో  డీజే టీల్లుతో సుధీర్ వేసిన పంచ్ మీద రోజా కౌంటర్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇందులోభాగంగానే సుదీర్ డీజే ఎక్కడ వాయిస్తారు అని అనడం.. అప్పుడు హీరో డీజే టిల్లు నీ చావుకు  కూడా వాయిస్తాను అని  అంటే వాడి చావు కంటే ఎక్కువగా వాడు పోలీసులకు ఎప్పుడు దొరుకుతాడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు అని వెంటనే రోజా కూడా కౌంటర్ వేస్తుంది.. ఇక దీంతో ఏం మాట్లాడాలో తెలియక సుధీర్ రోజాకు దండం పెట్టేస్తాడు.. అలా రోజా దెబ్బకు సుధీర్ టీమ్ మొత్తం గజగజ వణికి పోయి నట్టు అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: