టీవీ:ఈ సీరియల్ నటి రియల్ లైఫ్ తెలిస్తే షాక్..!

Divya
ప్రస్తుతం ఇప్పుడు ఎన్నో సరికొత్త సీరియల్స్ మంచి కథ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తూనే ఉన్నాయి. అలా ఎన్నో ఛానల్స్ ఉన్నప్పటికీ మా టీవీ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో ప్రసారమయ్యే సీరియల్స్ ను.. ఎంతో మంది ప్రేక్షకులు ఇష్టపడతారు. సరికొత్త సీరియల్స్ ను ప్రసారం చేయడంలో ఈ ఛానల్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక తాజాగా అందులో ప్రసారమయ్యే శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అని చెప్పవచ్చు. అందులో శ్రీదేవి పాత్రలో తొలిసారిగా.. బుల్లితెరపై అడుగుపెట్టింది అంకిత అమర్. ఈమె గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

బుల్లితెరపై నటిస్తున్న అంకిత అమర్  1997వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు వంటి ప్రాంతంలో జన్మించింది.. అటు తర్వాత చైల్డ్ యాక్టర్ గా కొన్ని సీరియల్స్ లో, పలు సినిమాలలో కూడా ఈమె నటించింది. కానీ ఆ తరువాత చదువు మీద దృష్టి పెట్టడంతో తన చదువును కొనసాగిస్తూ..MSC వరకు చదువుకుంది. అంతేకాకుండా అందులోనే రెండు గోల్డ్  మెడల్స్ కూడా సంపాదించుకుంది. అంకితకు చిన్న వయసు నుంచే డాన్స్ మీద ఎక్కువ ఇష్టం ఉండడంతో.. తనకు సమయం దొరికినప్పుడల్లా భరతనాట్యం నేర్చుకునేకి వెళ్ళేది. అలా సంగీతం వంటివి నేర్చుకున్న తరువాత తన చదువును పూర్తి చేసుకొని.. మొదటిసారిగా లెక్చరర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది.

అలాంటి సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు కన్నడలో కొన్ని సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చిందట.. మొదటిసారిగా"నమ్మనే యువరాణి"వంటి సీరియల్ లో నటించింది. అందులో ఆమె మీరా పాత్రలో నటించడం వల్ల అక్కడి ప్రేక్షకులు ఈమెకు మంచి మార్కులు వేశారు. ఇక ఆ తరువాత కొన్ని షో లకు యాంకర్ గా చేసి, కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇంత టాలెంట్ ఉంది గనుక అతి చిన్న వయసులోనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది అంకిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: