టీవీ : ఈటీవీ లో ప్రతి రోజు రాత్రి 9:30 కు ప్రసారమయ్యే ఈ డైలీ సీరియల్స్ గుర్తున్నాయా..?

Divya
అప్పట్లో ప్రముఖ ఈ టీవీ ఛానల్ లో 9:30 గంటలు అయ్యిందంటే చాలు సినిమా వచ్చేది. ఇక జనం కూడా బాగానే ఆ సినిమాకు కనెక్ట్ అయ్యారు.. వచ్చే కొద్దీ అలాంటి సమయంలో సినీమా టైం పది గంటలకు మార్చి తొమ్మిదిన్నర గంటలకు ఏదో ఒక సీరియల్ ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు ఈ టీవీ యాజమాన్యం.. మొదటిసారిగా 1999లో ఈ టివి లో 9:30 గంటలకు సంఘర్షణ సీరియల్ మొదలైంది. ఇందులో హరిత, జాతికి ,చిన్న, ఉదయభాను తదితరులు నటించి మెప్పించారు.
ఇక ఆ తర్వాత 2001లో ఈ టీవీ లో ప్రతి రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సంఘర్షణ సీరియల్ మొదలై ,  ముగిసిన వెంటనే చదరంగం సీరియల్ ప్రసారం అయింది.. ఇక ఈ సీరియల్లో హరిత , జ్యోతి రెడ్డి , ఉష, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.. ఈ సీరియల్ ను  9 గంటలకు మార్చి తొమ్మిదిన్నర గంటలకు జనని సీరియల్ స్టార్ట్ చేశారు.. జయసుధ డాక్టర్ గా నటించగా శరత్ బాబు తదితరులు నటించారు.
2002వ సంవత్సరంలో 9:30  గంటలకు మాతృదేవత అనే సీరియల్ ప్రసారం అయింది. శారద కీలక పాత్ర పోషించింది. 2003లో ఇల్లాలు సీరియల్ ప్రసారం చేశారు. ఈ సీరియల్లో భానుచందర్ ,రవి కుమార్, భావన, మంజుల తదితరులు నటించారు. 2003మధ్యలో నా మొగుడు నాకే సొంతం అనే సీరియల్ ని ప్రసారం చేశారు. ఇందులో జాకి, భావన, స్వాతి, సమీర్ లు నటించారు. 2004లో సంతోషం సీరియల్ స్టార్ట్ చేశారు.. అందులో నరసింహ రాజు, నాగబాబు , శృతి తదితరులు నటించారు. 2005లో కురుక్షేత్రం సీరియల్ స్టార్ట్ చేయగా , 2006లో యాహూ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. 2007లో సంధ్యా రాగం సీరియల్ స్టార్ట్ చేయగా.. 2008 లో యాహూ సీజన్ టు మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం అప్పటినుంచి జబర్దస్త్ కామెడీ షో, క్యాష్, వావ్ వంటి పలు ప్రోగ్రామ్లను ప్రసారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: